ఊహించని సంక్షోభం ముంచుకొస్తోంది..! వణుకుపుట్టిస్తున్న కియోసాకి కామెంట్స్‌

ఊహించని సంక్షోభం ముంచుకొస్తోంది..! వణుకుపుట్టిస్తున్న కియోసాకి కామెంట్స్‌


ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు పరిచితమైన ఆర్థిక వేత్త, రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌ పుస్తక రచయిత రాబర్డ్‌ కియోసాకి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026-27 మధ్యకాలంలో ప్రపంచం మరో పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశముందని హెచ్చరించారు. ఎక్స్‌ వేదికగా స్పందించిన కియోసాకి, రాబోయే మార్కెట్ పతనంలో ప్రజలు రెండు వర్గాలుగా విడిపోతారని అన్నారు. ఒక వర్గం ఆర్థికంగా నష్టపోతే, మరో వర్గం అదే పరిస్థితిని అవకాశంగా మార్చుకుని లాభపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

గత అనుభవాలను ప్రస్తావిస్తూ 1987, 2000, 2008 వంటి సంక్షోభాల్లో తాను నష్టపోకుండా, మరింత సంపదను కూడబెట్టినట్లు తెలిపారు. సంక్షోభాల సమయంలోనే అసలు అవకాశాలు దాగి ఉంటాయి అని ఆయన పేర్కొన్నారు. మార్కెట్లు కుప్పకూలినప్పుడు మంచి ఆస్తులు తక్కువ ధరలకు లభిస్తాయని, అప్పుడు పెట్టుబడులు పెట్టే వారు భవిష్యత్తులో లాభపడతారని వివరించారు. ప్రత్యేకంగా గోల్డ్‌, సిల్వర్‌, అలాగే రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో పెట్టుబడులు దీర్ఘకాలంలో లాభదాయకంగా మారవచ్చని ఆయన సూచించారు. అయితే సరైన ప్రణాళిక లేకుండా పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరమని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారతీయ పెట్టుబడిదారుల విషయంలో గ్లోబల్ మార్కెట్ల ప్రభావం దేశీయ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అందువల్ల మార్కెట్‌లోకి వెళ్లే ముందు రిస్క్‌ను అర్థం చేసుకుని, విభిన్న పెట్టుబడి మార్గాలను ఎంచుకోవడం అవసరమని సూచిస్తున్నారు. మొత్తానికి రాబోయే కాలంలో ఆర్థిక అస్థిరతలు పెరిగే అవకాశాల మధ్య, పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని, భయపడకుండా కానీ అజాగ్రత్తగా కూడా కాకుండా ముందుకు సాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *