Headlines

Modi: నా వీడియోపై స్పందించిన అందరికీ ధన్యవాదాలు.. మోదీ మరో వీడియో విడుదల

Modi: నా వీడియోపై స్పందించిన అందరికీ ధన్యవాదాలు.. మోదీ మరో వీడియో విడుదల


PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో మరో వీడియోను విడుదల చేశారు. శుక్రవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియా వేదికలో యువతకు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా యువతనుద్దేశించి మాట్లాడారు. తన వీడియోపై స్పందించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సలహాలు, సూచనలు పంపిన వారికి ధన్యవాదాలు సెల్ఫీ వీడియోలో తెలిపారు. మన బంధం ఎప్పటికీ పటిష్టంగానే ఉంటుందని, మీరు చూపిన ప్రేమ, నమ్మకం, నాకు బలాన్నిచ్చిందని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, నిన్న రాత్రి ఆలస్యంగా మీ అందరినీ కలిసే అవకాశం నాకు లభించింది. నా వీడియోపై మీ స్పందనకు, సానుకూల సూచనలకు నేను కృతజ్ఞుడను. మీ అందరికీ ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు. గురువారం రాత్రి ఆలస్యంగా ప్రధాని మోదీ ఒక వీడియో సందేశంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అందులో ఆయన పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *