Headlines

Manchu Lakshmi: మంచు లక్ష్మి చేతుల మీదుగా ప్రీ స్కూల్ ఓపెనింగ్.. చిన్నారులతో సరదాగా గడిపిన నటి.. వీడియో

Manchu Lakshmi: మంచు లక్ష్మి చేతుల మీదుగా ప్రీ స్కూల్ ఓపెనింగ్.. చిన్నారులతో సరదాగా గడిపిన నటి.. వీడియో


ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి చేతుల మీదుగా విష్ – (వెల్లింగ్టన్ ఇంటర్నేషనల్ స్కూల్ హైదరాబాద్) సాగర్ సోసైటీ, బంజారాహిల్స్ లో ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచ స్థాయి విద్యా విధానాలను అనుసరిస్తూ, చిన్నారుల సమగ్ర వికాసమే లక్ష్యంగా ఈ వినూత్న ప్రీ-స్కూల్ తన కార్యకలాపాలను ప్రారంభించింది.ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ప్రతి చిన్నారి తన సహజ ప్రతిభను వికసింపజేసుకునే వాతావరణంలో ఎదగాలని ఆకాంక్షించారు. పిల్లల్లో జిజ్ఞాస, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, కరుణ వంటి విలువలను సహజంగా పెంపొందించేలా విష్ విద్యా విధానాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. సంప్రదాయ బోధనకు అతీతంగా ప్రతి చిన్నారి ప్రత్యేకతను గుర్తించి అర్థవంతమైన అభ్యాస అనుభవాలను అందించాలనే పాఠశాల లక్ష్యాన్ని ప్రశంసించారు.

“ప్రతి చిన్నారి అపారమైన సామర్థ్యంతో జన్మిస్తాడు” అనే నమ్మకంతో విష్ విద్యా విధానాన్ని రూపొందించింది. స్కాండినేవియన్ అభ్యాస వాతావరణం, జపాన్ విద్యా విధానంలోని స్వతంత్రత, మైండ్‌ఫుల్‌నెస్, పరస్పర గౌరవం వంటి విలువలు, ప్రపంచ ప్రసిద్ధ రెగ్గోగో ఎమీలియా విధానం, ఎర్లీ ఇయర్ ప్రోగ్రామ్ సూత్రాలను సమన్వయం చేస్తూ ప్రత్యేకమైన అభ్యాస విధానాన్ని అమలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి



వ్యవస్థాపకురాలు దీప్తి చిట్కారా మాట్లాడుతూ, “ప్రతి చిన్నారి సహజంగానే జిజ్ఞాసతో, అపారమైన సామర్థ్యంతో ఉంటాడని మేము విశ్వసిస్తున్నాం. భద్రతతో కూడిన, ప్రేరణనిచ్చే, ఆనందభరితమైన వాతావరణంలో పిల్లలు తమ సామర్థ్యాన్ని గుర్తించి అభివృద్ధి చెందేలా చేయడమే మా లక్ష్యం. ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, అనుభూతి, జీవితాంతం నేర్చుకునే ఆసక్తిని పెంపొందించడమే మా ధ్యేయం” అని తెలిపారు.

సహ వ్యవస్థాపకుడు మనవ్ పురి మాట్లాడుతూ, “ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విద్యా విధానాలను ప్రేమతో కూడిన అభ్యాస వాతావరణంతో సమన్వయం చేసి చిన్నారుల విద్యను కొత్త స్థాయికి తీసుకెళ్లాలనేది మా విజన్. ప్రతి చిన్నారి అభ్యాసం అన్వేషణ, ఆవిష్కరణ, స్వీయ వ్యక్తీకరణతో కూడిన అద్భుతమైన ప్రయాణంగా మారాలని కోరుకుంటున్నాం” అని అన్నారు. పిల్లలను కేవలం పాఠశాలకే కాకుండా జీవితానికి సిద్ధం చేయాలనే లక్ష్యంతో స్వతంత్రత, బాధ్యత, ఆత్మవిశ్వాసం, సహానుభూతి, నాయకత్వ లక్షణాల అభివృద్ధిపై విష్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. క్యాంపస్‌లోని ప్రతి అంశం పిల్లలకు ఆనందదాయకమైన, అర్థవంతమైన, స్ఫూర్తిదాయకమైన అభ్యాస అనుభవాన్ని అందించేలా రూపొందించారు. ‘ప్రతి చిన్నారికి కేవలం విద్య మాత్రమే కాదు… తాను ఎవరో, ఏమి కావచ్చో తెలుసుకునే అవకాశాన్ని అందించడమే మా లక్ష్యం’ అని వారు పేర్కొన్నారు.

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *