Headlines

బాలయ్యకు గాయం.. డిసెంబర్ అయోమయం..!

బాలయ్యకు గాయం.. డిసెంబర్ అయోమయం..!


డిసెంబర్ లెక్కలు మారుతున్నాయా..? రిలీజ్ అవుతాయని చెప్తున్న సినిమాలన్నీ నిజంగానే విడుదలవుతాయా..? ఓ వైపు ప్రభాస్.. మరోవైపు బాలయ్య.. ఇంకోవైపు విజయ్ దేవరకొండ.. ఇలా చాలా మంది స్టార్స్ ఏడాది చివర్లో వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ బాలయ్య, షారుక్ ఖాన్ గాయాలు.. ఫౌజీ షూట్ జరుగుతున్న తీరు అభిమానుల్ని కంగారు పెడుతున్నాయి. అసలు డిసెంబర్ రేస్ ఎలా ఉండబోతుంది..? నిన్నటి వరకు బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమా ఆరునూరైనా అయితే దసరాకు లేదంటే డిసెంబర్‌లో రిలీజ్ ఫిక్స్ అనుకున్నారంతా. కానీ అనుకోకుండా షూట్‌లో బాలయ్య గాయపడటం, 4 వారాల విశ్రాంతి అనేసరికి డెడ్ లైన్ రీచ్ అవుతుందా అనే అనుమానాలు వస్తున్నాయిప్పుడు. ఇంత పెద్ద బ్రేక్ అంటే.. మళ్లీ అందరి డేట్స్ ఒకేసారి దొరకడం కష్టమే. బాలయ్య గాయం NBK111 రిలీజ్ లెక్కలను మార్చేసేలా కనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆగస్ట్ చివరి వారంలో కానీ బాలయ్య కోలుకుని సెట్‌కు రావడం కష్టమే. అంటే డిసెంబర్ మిస్సై.. 2027 సంక్రాంతికి లేదంటే ఆ తర్వాత సమ్మర్ సీజన్‌కు కానీ గోపీచంద్ మలినేని సినిమా వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు ఫౌజీ డిసెంబర్ 3న వస్తుందని ప్రకటించారు మేకర్స్. ఫౌజీ షూటింగ్ ఇంకా బాగానే బ్యాలెన్స్ ఉంది. ఓటిటి డెడ్ లైన్ ఉంది కాబట్టి డిసెంబర్ 3న కచ్చితంగా తెచ్చే ప్రయత్నాలైతే జరుగుతున్నాయి కానీ.. ఇంకా చేయాల్సిన షూట్ చాలా బాకీ ఉండటంతో డెడ్ లైన్ రీచ్ అయ్యేనా అనే అనుమానాలైతే ఉన్నాయి. మరోవైపు విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన సైతం డిసెంబర్ రేసులోనే ఉంది. విజయ్ దేవరకొండ, కీర్తిసురేష్ జంటగా నటిస్తున్న రౌడీ జనార్ధనను రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌పై ఎలాంటి అప్‌డేట్స్ లేవు. ఇక షారుక్ ఖాన్ కింగ్ డిసెంబర్ అంటున్నారు కానీ రావడం కష్టమే. గాయం కారణంగా కింగ్ షూట్ లేట్ అవుతుంది. మొత్తానికి డిసెంబర్‌లో సినిమాలు చాలానే అనౌన్స్ చేసారు.. అవి వచ్చేవరకు మాత్రం అనుమానాలే ఉన్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!

భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!

మనుషులను చల్లబరిచే ఫ్రిజ్‌.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు

40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!

Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *