Headlines

Minimum Balance Rules: మీ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉందా? ఏ బ్యాంకులో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? పూర్లి లిస్ట్‌ ఇదే..!

Minimum Balance Rules: మీ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉందా? ఏ బ్యాంకులో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? పూర్లి లిస్ట్‌ ఇదే..!


Minimum Balance Rules: ఏదైనా బ్యాంకులో సేవింగ్స్ ఖాతా (Savings Account) తెరవాలనుకున్నప్పుడు మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశం మినిమమ్‌ బ్యాలెన్స్‌. మీరు నివసించే ప్రాంతం (గ్రామీణ, సెమీ-అర్బన్, లేదా అర్బన్/మెట్రో), ఎంచుకునే అకౌంట్‌ రకాన్ని బట్టి ఈ కనీస నిల్వ మారుతూ ఉంటుంది. ఒకవేళ ఖాతాలో నిర్దేశిత నిల్వను నిర్వహించకపోతే బ్యాంకులు జరిమానాలు విధిస్తాయి. మన దేశంలోని ప్రధాన ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అమలు చేస్తున్న కనీస నిల్వ నిబంధనలు, జీరో-బ్యాలెన్స్ (Zero-Balance Account) సదుపాయాల పూర్తి వివరాలు ఇవే.

1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు అత్యంత ఉపశమనం కలిగించే నిబంధనను అమలు చేస్తోంది. ఎస్‌బీఐలోని అన్ని సాధారణ సేవింగ్స్ ఖాతాలకు జీరో-బ్యాలెన్స్ సదుపాయం అందుబాటులో ఉంది. అంటే మీ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉంచాలనే నిబంధన ఏదీ లేదు. కనీస నిల్వ లేనందుకు ఎలాంటి జరిమానాలు విధించరు.

2. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India)

యూనియన్ బ్యాంక్‌లో జీరో-బ్యాలెన్స్ ఖాతా సదుపాయం అందుబాటులో ఉంది. అయితే సాధారణ సేవింగ్స్ ఖాతాల విషయంలో చెక్ బుక్ ఉందా లేదా అనే దాన్ని బట్టి పరిమితులు ఉంటాయి.

ఇవి కూడా చదవండి



  • గ్రామీణ ప్రాంతాలు: చెక్ బుక్ ఉంటే రూ. 250, చెక్ బుక్ లేకపోతే రూ.100 ఉండాలి.
  • సెమీ-అర్బన్ ప్రాంతాలు: చెక్ బుక్ ఉంటే రూ. 500, చెక్ బుక్ లేకపోతే రూ. 250 నిర్వహించాలి.
  • అర్బన్/మెట్రో ప్రాంతాలు: చెక్ బుక్ ఉంటే రూ. 1,000, చెక్ బుక్ లేకపోతే రూ. 500 కనీస నిల్వగా ఉంచాల్సి ఉంటుంది.

3. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (HDFC Bank)

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో సాధారణ ఖాతాలకు జీరో-బ్యాలెన్స్ వెసులుబాటు లేదు. ఇక్కడ ప్రాంతాన్ని బట్టి కనీస నిల్వ ఉంటుందని గుర్తించుకోండి.

  • గ్రామీణ ప్రాంతాలు: రూ. 2,500
  • సెమీ-అర్బన్ ప్రాంతాలు: రూ. 5,000
  • అర్బన్/మెట్రో ప్రాంతాలు: రూ. 10,000

4. ఐసిఐసిఐ బ్యాంక్ (ICICI Bank)

ప్రముఖ ప్రైవేట్ రంగానికి చెందిన ఐసిఐసిఐ బ్యాంకులో సాధారణ సేవింగ్స్ ఖాతాలకు జీరో-బ్యాలెన్స్ సౌకర్యం లేదు. ఇందులో అకౌంట్ ఉన్నట్లయితే మినిమమ్‌ బ్యాలెన్స్‌ మెయింటెన్‌ చేయాల్సి ఉంటుంది.

  • గ్రామీణ ప్రాంతాలు: గ్రామీణ శాఖల్లో రూ. 1,000 లేదా రూరల్ బ్రాంచ్‌లలో రూ. 2,000 ఉంచాలి.
  • సెమీ-అర్బన్ ప్రాంతాలు: రూ. 5,000
  • అర్బన్/మెట్రో ప్రాంతాలు: రూ. 10,000

5. యాక్సిస్ బ్యాంక్ (Axis Bank)

యాక్సిస్ బ్యాంకులో సాధారణ ఖాతాలకు జీరో-బ్యాలెన్స్ సదుపాయం లభించదు. ఇందులో అకౌంట్‌ ఉన్నట్లయితే మీరు కనీస బ్యాలెన్స్‌ను మెయింటెన్‌ చేయాల్సి ఉంటుంది. లేకుంటే పెనాల్టీ రూపంలో నష్టపోవాల్సి ఉంటుందని గుర్తించుకోండి.

  • గ్రామీణ ప్రాంతాలు: రూ. 2,500
  • సెమీ-అర్బన్ ప్రాంతాలు: రూ. 5,000
  • అర్బన్/మెట్రో ప్రాంతాలు: రూ. 12,000

6. బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda)

బ్యాంక్ ఆఫ్ బరోడా సాధారణ ఖాతాలకు జీరో-బ్యాలెన్స్ సౌకర్యం లేదు. కానీ ఇతర ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే ఇక్కడ కనీస నిల్వ పరిమితులు చాలా తక్కువగా ఉంటాయి:

  • గ్రామీణ ప్రాంతాలు: రూ. 500
  • సెమీ-అర్బన్ ప్రాంతాలు: రూ. 1,000
  • అర్బన్/మెట్రో ప్రాంతాలు: రూ. 2,000

7. బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India)

బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ రకాల సేవింగ్స్ ఖాతాలను ఆఫర్ చేస్తోంది. వీటిలో జీరో-బ్యాలెన్స్ సౌకర్యం లేదు. ఇందులో కూడా మీకు అకౌంట్ ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండాలి. మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేనట్లయితే మీరు నష్టపోవాల్సి ఉంటుందని గుర్తించుకోండి.

  • సాధారణ సేవింగ్స్ ఖాతా (గ్రామీణ): రూ. 500
  • BOI స్టార్ మహిళా ఖాతా: రూ. 5,000
  • BOI స్టార్ సీనియర్ సిటిజన్ ఖాతా: రూ. 10,000

8. ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ (IDFC First Bank)

ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంకులో సాధారణ ఖాతాలకు జీరో-బ్యాలెన్స్ ఉండదు. వినియోగదారులు ఎంచుకునే ఖాతా రకాన్ని బట్టి కనీస నిల్వ రూ. 10,000 లేదా రూ. 25,000గా ఉంటుంది.

9. కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank)

కోటక్ మహీంద్రా బ్యాంకులో కొన్ని ప్రత్యేక ఖాతాలకు జీరో-బ్యాలెన్స్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అయితే మీరు ఎంచుకునే డిపాజిట్ స్కీమ్‌ను బట్టి కనీస నిల్వ మారుతుంటుంది.

  • సంకల్ప్ సేవింగ్స్ ఖాతా: రూ. 2,500
  • నోవా సేవింగ్స్ ఖాతా: రూ. 5,000
  • ఎడ్జ్, క్లాసిక్ ఖాతాలు: రూ. 10,000
  • ఎవరీడే, ప్రో ఖాతాలు: రూ. 20,000
  • ఏస్ (Ace) సేవింగ్స్ ఖాతా: రూ. 50,000

10. ఆర్‌బిఎల్ బ్యాంక్ (RBL Bank)

ఆర్‌బిఎల్ బ్యాంకులో కూడా కొన్ని ఎంపిక చేసిన ఖాతాలకు జీరో-బ్యాలెన్స్ సదుపాయం ఉంటుంది. ఇక్కడ కనీస నిల్వ ఉండాల్సిందే. లేకుంటే మీరు పెనాల్టీ చెల్లించుకోవాల్సి ఉంటుందని గుర్తించుకోండి.

  • డిజిటల్, సీనియర్స్ ఫస్ట్ ఖాతాలు: రూ. 5,000
  • ప్రైమ్ ఎడ్జ్, ఉమెన్స్ ఫస్ట్ ఖాతాలు: రూ. 10,000
  • అడ్వాంటేజ్ సేవింగ్స్ ఖాతా: రూ. 25,000
  • ఆర్‌బిఎల్ రైజ్ (RBL Rise) ఖాతా: రూ. 50,000

మీరు బ్యాంక్ ఖాతా తెరిచేటప్పుడు కేవలం ఆఫర్లు మాత్రమే కాకుండా, మీ ఆర్థిక పరిస్థితికి తగినట్లుగా మినిమమ్‌ బ్యాలెన్స్‌ రూల్స్‌ మీకు తగినట్లు ఉన్న బ్యాంకును ఎంచుకోవడం మంచిది. గ్రామీణ, చిన్న పట్టణాల వినియోగదారులకు ప్రభుత్వ బ్యాంకులు తక్కువ కనీస బ్యాలెన్స్‌ పరిమితులతో సౌకర్యవంతంగా ఉంటాయి.

ఇది కూడా చదవండి: Ration Card: మీకు రేషన్‌ కార్డు ఉందా? మరో రెండు రోజుల్లో ముగియనున్న గడువు.. లేకుంటే రేషన్‌ కట్‌..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *