Headlines

Megastar Chiranjeevi: చిరంజీవి, అనుష్క కాంబోలో మిస్సైన సినిమా.. కట్ చేస్తే.. ఆ హీరోయిన్‏తో బాస్ బ్లాక్ బస్టర్ హిట్..


మెగాస్టార్ చిరంజీవి దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘ఖైదీ నంబర్ 150’. తమిళ చిత్రం ‘కత్తి’ కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి వి.వి. వినాయక్ దర్శకత్వం వహించారు. రీఎంట్రీ సినిమా కావడం, చిరు మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలనుకోవడంతో ఈ సినిమాలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కోసం ఒక ప్రత్యేకమైన కామెడీ ట్రాక్‌ను డిజైన్ చేశారు. తమిళ మూవీ ‘కత్తి’ సినిమాలో ప్రధానంగా సీరియస్ డ్రామా, సోషల్ మెసేజ్ పైనే దృష్టి పెట్టారు. అయితే తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా మెగాస్టార్ అభిమానులకు చిరంజీవి-బ్రహ్మానందం కాంబినేషన్‌లో వచ్చే హస్య సన్నివేశాలు అంటే ఎంతో ఇష్టం. ‘ఘరానా మొగుడు’, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’, ‘బావగారూ బాగున్నారా?’, ‘ఠాగూర్’ చిత్రాల్లో వీరిద్దరి కాంబో నవ్వుల పూయించింది. అందుకే తెలుగు వెర్షన్ కోసం దర్శకుడు వి.వి. వినాయక్, రచయితల బృందం ప్రత్యేకంగా ‘దోపిడీ జోసెఫ్’ అనే పాత్రను సృష్టించారు. ఇందుకు కారణం కూడా చిరంజీవి కావడం గమనార్హం.

ఎక్కువ మంది చదివినవి : Roja: ఆ హీరో అంటే చాలా ఇష్టం.. ఆయనతో చాలా సినిమాలు చేశా.. హీరోయిన్ రోజా..

సినిమాలో చిరంజీవితో పాటు బ్రహ్మానందం, అలీ కలసి చేసే సన్నివేశాలు ప్రేక్షకాభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. చిరంజీవి జైలు నుంచి తప్పించుకునే సన్నివేశంలో బ్రహ్మానందాన్ని ఇరికించడం, ఆ తర్వాత వచ్చే గందరగోళం, అమాయకంగా బ్రహ్మీ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్లు థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించాయి. ఒరిజినల్ కథలోని కథానాయకుడి లక్షణాలను దెబ్బతీయకుండా, వినోదాన్ని జోడించడం పెద్ద సవాలుగా మారినా, వి.వి. వినాయక్ ఈ ట్రాక్‌ను చాలా చక్కగా తీర్చిదిద్దారు. నిజానికి ఈ సినిమాలో అసలు బ్రహ్మానందం ట్రాక్ లేదట.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: నిజమైన కథతో వచ్చిన 8 ఎపిసోడ్స్ సిరీస్.. 60 దేశాలలో నంబర్ వన్.. ఒక్కసారి చూస్తే అస్సలు వదలరు..

డైరెక్టర్ వివి వినాయక్ ఖైదీ సినిమాలో కాజల్, అనుష్క అని ఇద్దరు హీరోయిన్లను అనుకున్నారు. అందుకు తగినట్టే స్క్రిప్ట్ సైతం రెడీ చేసుకున్నారు. అయితే ఒకరోజు చిరంజీవి కాల్ చేసి తనకు బ్రహ్మనందం కామెడీ కావాలని అడిగారట. కానీ అప్పటికే స్క్రిప్ట్ మొత్తం రెడీ అయ్యిందని డైరెక్టర్ చెప్పడంతో నన్ను అనుమానించే వ్యక్తిగా ఏదైనా పాత్రను క్రియేట్ చేయొచ్చేమో చూడు అని చెప్పారట. దీంతో కథలో మార్పులు చేసి డాబర్ మ్యాన్ పాత్రను సృష్టించారు. దీంతో అనుష్క కోసం అనుకున్న ట్రాక్ మొత్తం తీసేయాల్సి వచ్చింది. అదే సమయంలో ఆమె మరో ప్రాజెక్టులో బిజీగా ఉండడంతో కాజల్ సింగిల్ హీరోయిన్ అయ్యింది. అలా ఖైదీ సినిమాలో బ్రహ్మానందం, చిరు, ఆలీ కామెడీ వర్కవుట్ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం.. ఆమె నుదుటన సూది మొనంత ప్రేమ రాయలేదు ఆ దేవుడు..

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంది రా బాబూ పాట.. 2 రోజులుగా యూట్యూబ్‏ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్.. డీజేలో మోత మోగిపోద్ది..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *