Headlines

Mega Photo: పాతికేళ్ల నాటి మెగా జ్ఞాపకం.. ‘ఠాగూర్’ సెట్‌లో అన్నయ్యను కలిసిన ‘గుడుంబా శంకర్’..!

Mega Photo: పాతికేళ్ల నాటి మెగా జ్ఞాపకం.. ‘ఠాగూర్’ సెట్‌లో అన్నయ్యను కలిసిన ‘గుడుంబా శంకర్’..!


సోషల్ మీడియా పుణ్యమా అని అప్పుడప్పుడు కొన్ని పాత ఫోటోలు బయటకు వచ్చి నెటిజన్లను.. మరీ ముఖ్యంగా అభిమానులను ఓ రేంజ్‌లో నాస్టాల్జియాలోకి తీసుకెళ్తుంటాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఉన్న ఒక రేర్ త్రోబ్యాక్ ఫోటో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. దాదాపు పాతికేళ్ల నాటి ఈ మధుర స్మృతి.. మెగా అభిమానులకు ఒక పండుగ లాంటిదనే చెప్పాలి. ఒకే ఫ్రేమ్‌లో అన్నదమ్ములిద్దరినీ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అప్పటి ఆ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సోషల్ మీడియాలో ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు. ఈ అరుదైన ఫోటో వెనుక ఉన్న అసలు కథ ఏమిటంటే.. ఇది 2003లో సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమా ‘ఠాగూర్’ సెట్స్‌లోనిది. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ శ్రియలపై సూపర్ హిట్ సాంగ్ ‘మన్మథ మన్మథ’ పాటను చిత్రీకరిస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Monalisa : మోనాలిసా ప్రేమకథలో మరో భారీ ట్విస్ట్.. అప్పట్లో కుంభమేళా సుందరి.. ఇప్పుడు గర్భిణి!

మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోని ఈ పాటకు డాన్స్ మాస్టర్ లారెన్స్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఆ సాంగ్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అక్కడికి వచ్చి అన్నయ్యను కలవడం విశేషం. అప్పట్లో ఈ కలయిక సెట్‌లో ఉన్నవారందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇక ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ గెటప్ చూస్తే.. ఆయన అప్పట్లో తను నటిస్తున్న ‘గుడుంబా శంకర్’ లుక్‌లో కనిపిస్తున్నారు. స్టైలిష్ మేకోవర్, డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో పవర్ స్టార్ ఎంతో మోడ్రన్‌గా ఉన్నారు. షూటింగ్ గ్యాప్‌లో చిరు, పవన్ ఇద్దరూ కలిసి ముచ్చటించుకుంటున్న ఈ దృశ్యం మెగా బ్రదర్స్ మధ్య ఉన్న అనుబంధానికి అద్దం పడుతోంది. ఎవరి సినిమాల షూటింగ్స్‌తో వాళ్ళు ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఇలా సెట్స్‌కి వెళ్లి కలుసుకోవడం ఆ రోజుల్లో ఫ్యాన్స్‌కు ఎంతో కిక్ ఇచ్చేది.

ఎక్కువమంది చదివినవి : Srikanth-Ooha : ఏంటీ.. ఆ స్టార్ నటుడు ఊహ మేనమామనా..? 100 సార్లు ఉత్తమ నటుడు.. తెలుగు వారికి సుపరిచితమే..

ఈ ఫోటో చూస్తుంటే ఆనాటి ఆత్మీయతలు, మెగా బ్రదర్స్ క్రేజ్ కళ్ళముందు మెదులుతాయి. తమిళంలో ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో విజయకాంత్ హీరోగా వచ్చిన ‘రమణ’ సినిమాకు అఫీషియల్ రీమేక్‌గా ‘ఠాగూర్’ తెరకెక్కింది. అప్పటికే ‘ఆది’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన వినాయక్, చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా.. తెలుగు నేటివిటీకి సరిపోయేలా అద్భుతమైన మార్పులు చేసి ఈ చిత్రాన్ని మలిచాడు. సెప్టెంబర్ 23, 2003న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద అక్షరాలా సునామీ సృష్టించింది. దాదాపు 30 కోట్లు షేర్ వసూలు చేసింది. అవినీతిపై ఒక ప్రొఫెసర్ సాగించిన పోరాటం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని, సినిమాను ఇండస్ట్రీ హిట్‌గా నిలబెట్టింది. ACF అనే పేరు చాలా ఏళ్ల పాటు మెగా అభిమానులకు అలా గుర్తుండిపోయింది.

ఎక్కువమంది చదివినవి : Aamani : వయసు 52 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. నా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. ఆమని కామెంట్స్..

‘ఠాగూర్’ సాధించిన రికార్డులు అప్పట్లో టాలీవుడ్ చరిత్రను తిరగరాశాయి. కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రం.. ఏకంగా 253 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుని సంచలనం సృష్టించింది. అలాగే 191 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమై మునుపెన్నడూ లేని సరికొత్త రికార్డులను తన పేరిట లిఖించుకుంది. చిరంజీవి కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయిన ఈ సినిమా సెట్స్‌లో.. పవర్ స్టార్ సైతం సందడి చేయడం.. ఆ ఫోటో ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవ్వడం చూస్తుంటే, పాతికేళ్ల క్రితం నాటి మెగా మేనియాను మరోసారి కళ్లకు కట్టినట్లుగా గుర్తుచేస్తోంది. అన్నట్లు ఆ తర్వాత రోజుల్లో పవన్ కళ్యాణ్‌తో కలిసి బాలు సినిమాలో నటించింది శ్రీయ. అది యావరేజ్‌గా ఆడినా పాటలు మాత్రం చార్ట్ బస్టర్ అయ్యాయి.

ఎక్కువమంది చదివినవి : Actress Raashi: ఆ హీరోయిన్ గురించి గొప్పగా చెప్పిన రాశి.. తన పెళ్లికి వారం రోజుల ముందే మరణించిందంటూ ఎమోషనల్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *