Headlines

Mamtha Mohandas: తెలుగులో ఆ హీరో అంటే చాలా చాలా ఇష్టం.. అతడితో మాత్రమే నా బాధలు చెప్పుకుంటా.. మమతా మోహన్ దాస్..


టాలీవుడ్‌లో తనదైన నటన, గాత్రంతో ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ మమతా మోహన్‌దాస్. మలయాళంలో అత్యధిక చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. క్యాన్సర్ రావడంతో సినిమాలకు దూరమైంది. చాలా కాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్న అమ్మడు ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పుకొచ్చారు. తారక్‌తో తనకు ఉన్న అనుబంధం, ఆయన ఎనర్జీ, అలాగే వ్యక్తిగత స్నేహం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి అని మమతా మోహన్‌దాస్ తెలిపారు. తారక్ ఎనర్జీ, మ్యూజిక్‌పై ఉన్న ఇష్టం తనకు ఎంతో నచ్చుతాయని చెప్పారు. ‘హలో’ అని పలకరించినప్పుడే ఒక ప్రత్యేకమైన వైబ్, ఎనర్జీ కనిపిస్తాయని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి గడిచినా, ఒకరోజు తాను అమెరికాలో ఉన్నప్పుడు తారక్ నుంచి ఆకస్మికంగా ఫోన్ కాల్ వచ్చిందని మమతా గుర్తుచేసుకున్నారు. ఎక్కడి నుంచి తన నంబర్ దొరికింది అని అడిగితే, రాండమ్‌గా కాల్ చేశానని తారక్ సరదాగా చెప్పారని, ఎప్పటిలాగే అదే ఎనర్జీ, అదే జోష్‌తో మాట్లాడారని వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : KS Chitra : తెలుగులో పెద్ద హీరోయిన్.. ఆమెకు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని.. చిత్ర..

తెలుగు సినీ పరిశ్రమలో కెరీర్ ప్రారంభంలో తాను చాలా చిన్న వయసులో ఉన్నందున పెద్దగా ఇంటరాక్ట్ కాలేదని, అందరితో గౌరవంగానే ఉండేదానినని మమతా తెలిపా. అయితే కొంతమందితో మాత్రం మంచి స్నేహం ఏర్పడిందని, వారిలో జూనియర్ ఎన్టీఆర్, జగపతి బాబు చాలా దగ్గరయ్యారని చెప్పారు. వారిని కేవలం నటులుగా కాకుండా, మనుషులుగా మాత్రమే చూస్తానని పేర్కొన్నారు.

తారక్‌తో సమానమైన ఎనర్జీ, మంచి సంభాషణ ఉంటుందని, ఏ విషయాన్నైనా నిరభ్యంతరంగా మాట్లాడుకోగలమని మమతా మోహన్‌దాస్ చెప్పారు. తనకు ఏ కష్టం వచ్చిన చెప్పుకునే స్నేహితులలో తారక్ ఒకరని అన్నారు. అలాంటి వ్యక్తులంటే తనకు ఎంతో ఇష్టమని, తారక్ తన ఫేవరెట్ పర్సన్ అని మరోసారి స్పష్టం చేశారు. బహ్రెయిన్‌లోని ఇండియన్ స్కూల్‌లో పాఠశాల విద్యను, బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే కర్ణాటక, హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాల్లో శిక్షణ పొందారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..

మమతా మోహన్ దాస్, జూనియర్ ఎన్టీఆర్..

Mamtha Mohandas, Jrntr

Mamtha Mohandas, Jrntr

ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *