అన్ని పువ్వుల కంటే తామర పూలు కొంచం ప్రత్యేకమైనవని చెప్పాలి. ఎందుకంటే ఇవి నీటిలోనే బతుకుతాయి. నార్మల్ గా పెంచాలంటే కొద్దిగా కష్టమనే అనుకుంటారు. చెరువుల్లోనే కాకుండా మీ ఇంట్లో కూడా వీటిని పెంచవచ్చు. ఇలా టిప్స్ పాటిస్తే చిన్న తొట్టెలోనే గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి.
ఈ మొక్కలు పెంచాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే సరైన మట్టి కూడా తీసుకోవాలి, ఇంకా తగినంత సూర్యరశ్మి, అలాగే ఎప్పుడూ నీరు ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో ఈ పువ్వులు పెంచాలి అనుకుంటే ఈ మొక్కను తీసుకుని నాటి, ఆ తర్వాత నీరు పోయడం, ఎరువులు కూడా సరైన సమయానికి వేస్తూ ఉండాలి..
మీరు దుంపను నాటిన తర్వాత ముందుగా కుండీలో నీరు పోయాలి. ఆ తరవాత మొదట మట్టి పైన నీరు ఉంచాలి. అలాగే, దుంప ఎండిపోకుండా నీటిని పోస్తూ ఉండాలి. ఇంకా ఈ మొక్కకు ఆకులు వచ్చాక నీటిని ఎక్కువగా పోస్తూ ఉండాలి. తామర పువ్వు మొక్కకు రోజూ 7 గంటల పాటు సూర్యరశ్మి అందాలి. ఎండ తగిలితేనే పువ్వులు బాగా పూస్తాయి.
ఈ దుంపకు మీరు ముందుగానే ఎరువులు వేయకూడదు. ఇంకా ఆకులు నీటిపై నుంచి వచ్చిన తర్వాత ఈ మొక్కలకు ఉపయోగించే ఎరువును కొంచం జాగ్రత్తగా వేయాలి. ఇంకా ఎరువులను నీటిలో కలపకూడదు. అలాగే , కుండీలో నీరు తగ్గినప్పుడు మళ్లీ నింపాలి.
నీరు మొత్తం ఎండిపోకుండా మంచిగా చూసుకోవాలి.
ఇంకా ఎండిపోయిన ఆకులు, పువ్వులను కూడా తొలగించాలి. అయితే, ఈ నీటి అడుగున ఉన్న కాండాలను కూడా కత్తిరించకూడదు. తామర పువ్వు మొక్కకు పువ్వులు సూర్యరశ్మి వల్లే వస్తాయి. మొక్క మొత్తం ఎదిగిన తరవాత పువ్వులు బాగా పూస్తాయి. అయితే ఈ
విత్తనాల నుంచి పువ్వులు రావడానికి సమయం పడుతుంది




