Headlines

రోజూ వాడే ఫేస్ క్రీములు, బాడీ లోషన్లతో అందం పెరుగుతుందా..? అనర్థం జరుగుతుందా..?


రోజూ వాడే ఫేస్ క్రీములు, బాడీ లోషన్లతో అందం పెరుగుతుందా..? అనర్థం జరుగుతుందా..?

సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం మార్కెట్‌లో విచ్చలవిడిగా లభించే క్రీమ్‌లు, లోషన్లలో మెరుపు తీసుకురావడానికి అనేక రసాయనాలు కలుపుతున్నారు. ముఖ్యంగా పారాబెన్స్, ఫ్రాతలేట్స్, హైడ్రోక్వినోన్, స్టెరాయిడ్లు, మెర్క్యురీ లాంటి కాంపౌండ్లు వీటిలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. క్రీమ్‌ను ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు పారాబెన్స్ వాడితే, సువాసన నిలిచి ఉండేందుకు ఫ్రాతలేట్స్ ఉపయోగిస్తారు. అలాగే త్వరితగతిన చర్మం తెల్లగా మారడానికి హైడ్రోక్వినోన్, స్టెరాయిడ్లను అత్యధిక స్థాయిలో మిక్స్ చేస్తున్నారు. చర్మంపై అప్లై చేసినప్పుడు ఈ రసాయనాలు రంధ్రాల గుండా చర్మ కణజాలాల్లోకి చేరుతాయి.

చర్మంపై రాసిన రసాయనాలు రక్తప్రసరణ వ్యవస్థలోకి వెళ్లి శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలికంగా హైడ్రోక్వినోన్ వాడితే చర్మ కణాలు నశించి చర్మ క్యాన్సర్ లేదా ‘ఆక్రోనోసిస్’ అనే శాశ్వత నల్లమచ్చల వ్యాధికి దారితీస్తుంది. ఏదైనా క్రీమ్ వాడే ముందు అందులోని పదార్థాల జాబితాను పరిశీలించడం, డెర్మటాలజిస్ట్ సలహా మేరకు మాత్రమే ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ – WHOతో పాటు అనేక అంతర్జాతీయ డెర్మటాలజీ పరిశోధనా సంస్థలు ఫెయిర్‌నెస్ క్రీమ్‌లపై హెచ్చరికలు జారీ చేశాయి. మెర్క్యురీ, హెవీ మెటల్స్ ఉన్న క్రీమ్స్ వాడకం వల్ల న్యూరోలాజికల్ సమస్యలు, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి మానసిక లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల ప్రచురితమైన మెడికల్ జర్నల్ నివేదికల ప్రకారం ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరికే సౌందర్య క్రీముల్లో 40 శాతానికి పైగా అనుమతించిన స్థాయి కంటే ఎక్కువ స్టెరాయిడ్లు, రసాయనాలు ఉంటున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *