Headlines

Serial : హీటెక్కిస్తోన్న సీరియల్ బ్యూటీ.. ప్రియుడిని పరిచయం చేసిన మీనా.. నెట్టింట అమ్మడు అరాచకమే..

Serial : హీటెక్కిస్తోన్న సీరియల్ బ్యూటీ.. ప్రియుడిని పరిచయం చేసిన మీనా.. నెట్టింట అమ్మడు అరాచకమే..


బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు అమూల్య గౌడ. కన్నడలో పలు సీరియల్స్ చేసిన ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులో ఈ బ్యూటీ చాలా బిజీ. విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రముఖ తెలుగు సీరియల్ ‘గుండె నిండా గుడిగంటలు’లో మీనా పాత్రలో నటిస్తూ తన సహజసిద్ధమైన నటనతో తెలుగు జనాలకు ఎంతో దగ్గరయ్యారు. అంతకుముందు కన్నడలో అనేక ప్రజాదరణ పొందిన సీరియల్స్‌లో నటించిన ఈ భామ, తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకొని వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా అమూల్య గౌడ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా కన్నడ నాట సూపర్ హిట్ అయిన ‘కమలి’ సీరియల్‌లో తనతో కలసి నటించిన కో-యాక్టర్ నిరంజన్ బి.ఎస్ (Niranjan B.S.)తో ఆమె డేటింగ్ చేస్తోందనే ప్రచారం జరిగింది. తాజాగా ఈ ఊహాగానాలకు తెరదించుతూ, అమూల్య గౌడ తన ప్రియుడు నిరంజన్‌ను అభిమానులకు పరిచయం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

‘కమలి’ సీరియల్ చిత్రీకరణ సమయంలోనే అమూల్య, నిరంజన్ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్తా కాలక్రమేణా ప్రేమగా మారింది. స్క్రీన్ పైనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ ఈ జోడీ చూడముచ్చటగా ఉండటంతో వీరి కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఇరు కుటుంబాల సభ్యులకు కూడా వీరి పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఫైట్ అంటే నిప్పులా ఉంటారు.. అలాంటి హీరోను జీవితంలో చూడలేదు.. టాలీవుడ్ నటుడు..

ఇదిలా ఉంటే.. తన ప్రియుడు నిరంజన్ తో కలిసి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసినట్లు అమూల్య గౌడ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను సైతం షేర్ చేస్తుంది. నిరంజన్ కన్నడలో అనేక సీరియల్స్ చేశాడు. తెలుగులో ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema: ఇదెక్కడి సస్పెన్స్ రా బాబూ.. 2 గంటలు చెమటలు పట్టించే థ్రిల్లర్ మూవీ.. ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో దుమ్మురే

అమూల్య గౌడ ఫోటోస్..

ఎక్కువ మంది చదివినవి : Cinema: 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు.. 8 ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ క్రైమ్ థ్రిల్లర్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *