Headlines

Jabardasth: ఈగ సినిమాలో నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు.. ఈ జబర్దస్త్ నటుడు ఎవరో తెలుసా.?

Jabardasth: ఈగ సినిమాలో నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు.. ఈ జబర్దస్త్ నటుడు ఎవరో తెలుసా.?


నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈగ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ సినిమా టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈగను ప్రధానపాత్రగా చేసి రాజమౌళి చేసిన ఈ ప్రయోగం ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతే కాదు ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈగ సినిమాలో నాని, సమంత, కిచ్చ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించారు. కన్నడ హీరో సుదీప్ ఈ సినిమాతో టెలుగుప్రేక్షకులకు పరిచయం అయ్యారు. విలన్ గా అదరగొట్టేశాడు సుదీప్. ఇక ఈ సినిమాలో కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమాకు మ్యూజిక్ పెద్ద ప్లస్.

సౌందర్య ఆ స్టార్ హీరోతో సినిమా చేయాల్సింది.. కానీ అతను చెప్పిన ఒకే ఒక్క మాటతో..

2012లో తెరకెక్కిన ఈ సినిమాను రూ. 40కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. కాగా ఈ సినిమా ఏకంగా రూ. 120కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇదిలా ఉంటే ఈగ సినిమాలో ఓ ఫెమస్ జబర్దస్త్ నటుడు నటించారు. సినిమాలో తాగుబోతు రమేష్ కాకుండా మరో జబర్దస్త్ నటుడు కూడా నటించారు. కానీ అతన్ని ఎవరూ గుర్తుపట్టలేదు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా చెప్పే వరుకు చాలా మందికి తెలియదు. ఇంతకూ ఆ నటుడు ఎవరో కాదు. అతను అదిరే అభి.

ఇవి కూడా చదవండి

తల్లి దండ్రులకు కర్మకాండలు చేయలేకపోయా..! బంధువులందరూ తిట్టారు.. ఎమోష్నల్ అయిన హీరో

ఈగ సినిమాలులో సమంత కిచ్చ సుదీప్ కారులో వెళ్తుండగా నాని వాళ్లను ఫాలో చేసే సన్నివేశంలో నానికి ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపేస్తాడు.. లైసెన్స్ ఉందా.? హెల్మెట్ ఉందా అంటూ ప్రశ్నిస్తాడు. ఆ ట్రాఫిక్ పోలీస్ పాత్రలో నటించింది అభినే.. ఇదే విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇక జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అభి పలు సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. బాహుబలి సినిమాలోనూ చిన్న పాత్రలో కనిపించాడు అభి. ఇటీవలే అభి దర్శకుడిగా మారి రాజ్ తరుణ్ తో చిరంజీవ అనే సినిమా చేశాడు. ఇక ఇప్పుడు కామాఖ్యా అనే సినిమా చేస్తున్నాడు

50 దేశాల్లో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా.. తొలి తెలుగు పాన్ వరల్డ్ మూవీ.. ఇప్పటికీ ఆ రికార్డ్ అలానే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *