Fraud Alert: తస్మాత్ జాగ్రత్త.. జనాభా లెక్కల పేరుతో ఇంటికి వస్తున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ!

Fraud Alert: తస్మాత్ జాగ్రత్త.. జనాభా లెక్కల పేరుతో ఇంటికి వస్తున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ!


Fraud Alert: దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభం కానుంది. దీనిని అదనుగా చేసుకుని కొంతమంది కేటుగాళ్లు ‘జనాభా లెక్కల అధికారులం’ అంటూ ఇళ్లపై పడి ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వారి పట్ల ఎలా వ్యవహరించాలో తెలుసుకుందాం..

మీ ఇంటికి ఎవరైనా జనాభా లెక్కల కోసం వస్తే పాటించాల్సిన జాగ్రత్తలు:

అపరిచితులను ఇంట్లోకి రానివ్వకండి: వారు ఎవరో, నిజమైన అధికారులో కాదో తెలిసే వరకు వారిని ఇంటి బయటనే ఉంచి మాట్లాడండి. ఇంట్లోకి పిలిచి మర్యాదలు చేయకండి

ఇవి కూడా చదవండి

ఏ వివరాలు అడుగుతారు?: ప్రభుత్వం పంపిన అసలైన అధికారులు సాధారణంగా మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? తాగునీటి సదుపాయం ఏంటి? మీరు ఉంటున్నది సొంత ఇల్లా లేక అద్దె ఇల్లా? మీ ఇంట్లో టీవీ, లాప్‌టాప్ వంటి వస్తువులు ఉన్నాయా? వంటి ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే అడుగుతారు.

Gold, Silver Prices Crash: బంగారం, వెండి ప్రియులకు పండగే.. భారీ పతనం.. కేజీ వెండిపై లక్షన్నర తగ్గుదల!

ఏ వివరాలు అస్సలు ఇవ్వకూడదు?:

  • ఆధార్ కార్డు నంబర్, పాన్ కార్డు వివరాలు.
  • బ్యాంక్ ఖాతా వివరాలు.
  • మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ (OTP)లు
  • యాప్‌లు, లింక్‌ల పట్ల జాగ్రత్త: వారు చెప్పారని మీ ఫోన్‌లో ఎలాంటి యాప్‌లు డౌన్లోడ్ చేయకండి. అలాగే వారు పంపే లింక్‌లపై క్లిక్ చేయకండి.

మోసగాళ్లు వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి?

మీ ఏరియాలో లేదా మీ ఇంటికి ఇలాంటి అనుమానిత వ్యక్తులు వస్తే వెంటనే ఈ కింది నంబర్లకు సమాచారం అందించండి:

  • 112: అత్యవసర సహాయం కోసం.
  • 1930: సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్.

Baba Vanga: వినాశనం అంచున ప్రపంచం.. 2026పై బాబా వెంగా చేసిన ఈ 5 భయంకర భవిష్యవాణిలు నిజమైతే ఏమవుతుంది?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *