IPL 2026 : ఐపీఎల్ పాయింట్స్ టేబుల్.. పంజాబ్ ఫస్ట్, ఆర్సీబీ సెకండ్.. సన్‌రైజర్స్ ఫోర్త్.. మరి ముంబై, చెన్నై పరిస్థితి ఏంటి?

IPL 2026 : ఐపీఎల్ పాయింట్స్ టేబుల్.. పంజాబ్ ఫస్ట్, ఆర్సీబీ సెకండ్.. సన్‌రైజర్స్ ఫోర్త్.. మరి ముంబై, చెన్నై పరిస్థితి ఏంటి?


IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. లీగ్ దశ సగం ముగిసేసరికి పాయింట్ల పట్టికలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలైనప్పటికీ, పంజాబ్ కింగ్స్ తన అగ్రస్థానాన్ని కాపాడుకోవడం విశేషం. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని పంజాబ్ జట్టు ఈ సీజన్‌లో ఓటమెరుగని వీరుడిలా దూసుకుపోతూ, ఎట్టకేలకు ఎనిమిదో మ్యాచ్‌లో మొదటి ఓటమిని రుచి చూసింది. అయితే, గతంలో సాధించిన వరుస విజయాలు ఆ జట్టును ఇంకా నంబర్ వన్ పీఠం మీదే కూర్చోబెట్టాయి. ప్రస్తుతం టాప్ 4 రేసులో ఏ జట్లు ఉన్నాయి? మిగిలిన జట్ల పరిస్థితి ఏంటి? అన్న పూర్తి వివరాలు చూద్దాం.

పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో ఆడిన 8 మ్యాచ్‌లలో 6 విజయాలు నమోదు చేసింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాయింట్లు పంచుకుంది. దీంతో మొత్తం 13 పాయింట్లతో టేబుల్ టాప్ లో ఉంది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, అంతకుముందే సంపాదించిన పాయింట్లు ఆ జట్టుకు రక్షణ కవచంలా నిలిచాయి. నెట్ రన్ రేట్ (+1.043) కూడా పాజిటివ్‌గా ఉండడం ఆ జట్టుకు కలిసి వచ్చింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ ఈసారి టైటిల్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది.

పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కొనసాగుతోంది. 8 మ్యాచ్‌లలో 6 గెలిచిన ఆర్సీబీ 12 పాయింట్లతో ఉంది. ఆ జట్టు నెట్ రన్ రేట్ (+1.919) చాలా బలంగా ఉండటం విశేషం. ఇక రాజస్థాన్ రాయల్స్ (RR) కూడా 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. అయితే రాజస్థాన్ 9 మ్యాచ్‌లు ఆడి 6 గెలిచింది, అంటే ఒక మ్యాచ్ అదనంగా ఆడింది కాబట్టి మూడో స్థానానికి పరిమితమైంది. నాలుగో స్థానంలో మన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఉంది. 8 మ్యాచ్‌లలో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్ రేసులో దూసుకుపోతోంది.

ఐదో స్థానంలో గుజరాత్ టైటాన్స్ (GT) 8 మ్యాచ్‌లలో 4 విజయాలతో 8 పాయింట్లు పొందింది. అయితే నెట్ రన్ రేట్ మైనస్‎లో ఉండటం ఆ జట్టుకు ఆందోళన కలిగించే విషయం. ఆశ్చర్యకరంగా ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆరో స్థానంలో ఉంది. 8 మ్యాచ్‌లలో కేవలం 3 విజయాలు మాత్రమే నమోదు చేసి 6 పాయింట్లతో ఇబ్బంది పడుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) కూడా 8 మ్యాచ్‌లలో 3 విజయాలతో ఏడో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ పరంగా చెన్నై కంటే ఢిల్లీ వెనుకబడి ఉంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పరిస్థితి ఈసారి దారుణంగా ఉంది. 8 మ్యాచ్‌లలో కేవలం 2 గెలిచి, ఒక మ్యాచ్ రద్దు కావడంతో 5 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక ముంబై ఇండియన్స్ (MI) ఫ్యాన్స్ కు నిరాశ తప్పడం లేదు. 7 మ్యాచ్‌లలో కేవలం 2 విజయాలతో 4 పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానంలో ఉంది. అన్నిటికంటే దారుణంగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పదో స్థానంలో పడిపోయింది. ఆడిన 8 మ్యాచ్‌లలో 6 ఓడిపోయి, కేవలం 4 పాయింట్లు, దారుణమైన నెట్ రన్ రేట్ (-1.106)తో టేబుల్ అట్టడుగున నిలిచింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *