Hyundai EV: ఎలక్ట్రిక్ వాహన రంగంలో హ్యుందాయ్ తన పట్టును మరింత బిగించేందుకు సిద్ధమైంది. తాజాగా గ్లోబల్ మార్కెట్లోకి ‘అయోనిక్ 3’ (Ioniq 3) అనే కాంపాక్ట్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను పరిచయం చేసింది. మెరుగైన రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్, స్మార్ట్ ఫీచర్లతో వస్తున్న ఈ కారు మధ్యతరగతి ఈవీ ప్రియులను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.
డిజైన్, కొలతలు:
- అయోనిక్ 3 ని హ్యుందాయ్ తన ‘ఏరో హ్యాచ్’ (Aero Hatch) డిజైన్ ఫిలాసఫీతో నిర్మించింది. దీనివల్ల కారు గాలిని సులువుగా చీల్చుకుంటూ వెళ్తుంది.
- పొడవు: 4,155 మి.మీ (దాదాపు హ్యాచ్‌బ్యాక్ సైజులో ఉన్నా, లోపల స్పేస్ మాత్రం ఎస్‌యూవీ తరహాలో ఉంటుంది).
- వీల్‌బేస్: 2,680 మి.మీ ఉండటం వల్ల లెగ్ రూమ్ చాలా ఎక్కువగా లభిస్తుంది.
- లైటింగ్: ఇతర అయోనిక్ మోడల్స్ లాగే దీనికి కూడా ‘పిక్సెల్ స్టైల్’ ఎల్‌ఈడీ లైట్లు ఉన్నాయి.
బ్యాటరీ, పర్ఫార్మెన్స్:
ఈ కారు రెండు బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది: స్టాండర్డ్ ప్యాక్ (42.2 kWh): ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 344 కి.మీ రేంజ్ ఇస్తుంది. లాంగ్ రేంజ్ వెర్షన్ (61 kWh): ఇది గరిష్టంగా 496 కి.మీ (WLTP) రేంజ్ అందిస్తుంది.
పవర్: 147 PS పవర్, 250 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 0 నుండి 100 కి.మీ వేగాన్ని కేవలం 9 సెకన్లలో అందుకుంటుంది.
ఇవి కూడా చదవండి
ఫాస్ట్ ఛార్జింగ్:
ఈ కారులోని అతిపెద్ద ప్లస్ పాయింట్ ఛార్జింగ్ వేగం. డీసీ (DC) ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 29 నుండి 30 నిమిషాల్లో 10% నుండి 80% వరకు బ్యాటరీని నింపవచ్చు.
ఇంటీరియర్, ఫీచర్లు:
లోపల 14.6 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. V2L (Vehicle-to-Load): ఈ ఫీచర్ ద్వారా కారు బ్యాటరీని ఉపయోగించి ల్యాప్‌టాప్స్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక భద్రత విషయానికొస్తే.. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీపింగ్ అసిస్ట్ వంటి అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఇందులో ఉన్నాయి. హ్యుందాయ్ ఈ కారును సుమారు 25,000 యూరోల (దాదాపు రూ.26 – రూ.28 లక్షలు) ప్రారంభ ధరతో గ్లోబల్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను బట్టి చూస్తే, భవిష్యత్తులో హ్యుందాయ్ ఈ మోడల్‌ను ఇక్కడి మార్కెట్‌కు అనుగుణంగా రూ.20 – రూ.30 లక్షల బడ్జెట్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి