Headlines

IND vs ZIM: ప్లేస్ మారింది, ఇక అతడ్ని ఆపలేమంతే.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే..?

IND vs ZIM: ప్లేస్ మారింది, ఇక అతడ్ని ఆపలేమంతే.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే..?


India vs Zimbabwe 1st T20I: యూకే పర్యటనలో తీవ్ర నిరాశ ఎదుర్కొన్న భారత టీ20 జట్టు, జూలై 23 నుంచి జింబాబ్వేతో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సమాయత్తమవుతోంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని టీమిండియా, ఈ సిరీస్‌తో మళ్లీ విజయాల బాట పట్టాలని ఆరాటపడుతోంది. హరారే వేదికగా గురువారం జరగనున్న తొలి టీ20 కోసం తుది జట్టు కూర్పు ఖరారైంది.

గెలుపే లక్ష్యంగా శ్రేయస్ సేన.. ఓటమి భారానికి చెక్ పెట్టేనా..?

ఇటీవల ముగిసిన ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత జట్టు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లలోనూ పరాజయం పాలైన టీమిండియా, ఇంగ్లాండ్‌పై ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ వర్షార్పణం కాగా, మిగిలిన నాలుగింటిలోనూ దారుణంగా ఓడిపోయింది.

ఇదికూడా చదవండి: ఆల్‌రౌండర్ మోజులో అసలైన వికెట్ టేకర్ బలి.. భారత్ కొంపముంచుతోన్న గంభీర్ మొండి పట్టుదల

ఇవి కూడా చదవండి



ఈ వరుస పరాజయాల వల్ల తీవ్ర ఒత్తిడిలో ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు ఈ జింబాబ్వే పర్యటన అత్యంత కీలకంగా మారింది. విజయం సాధించి కెప్టెన్‌గా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయన భుజాలపై ఉంది.

వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఫినిషర్‌గా రింకూ సింగ్ రీఎంట్రీ..!

సంజూ శాంసన్‌కు ఈ సిరీస్‌లో విశ్రాంతినివ్వడంతో విస్ఫోటక ఆటగాడు అభిషేక్ శర్మకు తోడుగా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నిరాశపరిచిన వైభవ్, ఈ సిరీస్‌తో తన ఆక్రమణ వైఖరితో కూడిన బ్యాటింగ్‌ను నిరూపించుకోవాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

మరోవైపు టీమిండియా అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే వార్త ఏంటంటే, విధ్వంసకర ఫినిషర్ రింకూ సింగ్ మళ్లీ తుది జట్టులోకి అడుగుపెడుతున్నాడు. మ్యాచ్ చివర్లో వేగంగా పరుగులు రాబట్టడంలో సిద్ధహస్తుడైన రింకూ రాక జట్టు బలాన్ని పెంచనుంది.

పటిష్టంగా మిడిలార్డర్.. ఆల్‌రౌండర్లుగా దూబే ద్వయం..!

మూడో స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్‌కు రానుండగా, నాలుగో స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ బాధ్యతలు చేపడతారు. ఆ తర్వాత ఆల్‌రౌండర్లుగా శివమ్ దూబే, హర్ష్ దూబే తమ సేవలను అందించనున్నారు.

ఇదికూడా చదవండి: టీమిండియా పరువు తీశారుగా.. ఆ ఒక్కడిని పక్కనపెట్టి పెద్ద తప్పు చేశారయ్యా గంభీర్..!

స్పిన్ విభాగానికి రవి బిష్ణోయ్ నాయకత్వం వహించనుండగా, ఆయనకు హర్ష్ దూబే తోడ్పడతారు. పేస్ బౌలింగ్ విభాగంలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లు కీలక పాత్ర పోషించనున్నారు.

టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, శివమ్ దూబే, హర్ష్ దూబే, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *