Headlines

ICC T20 Rankings: అరె ఏంట్రా ఇది.. ఆరంగేట్రం చేయకుండానే అగ్రస్థానానికి దూసుకెళ్లిన పాకిస్థాన్ బౌలర్


ICC T20 Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‎లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన నంబర్-1 బౌలర్ హోదాను కోల్పోగా, పాకిస్థాన్‌కు చెందిన స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఎలాంటి మ్యాచ్ ఆడకుండానే ప్రపంచ నంబర్-1 బౌలర్‌గా అవతరించాడు. క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఈ మార్పు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో జరిగిస మ్యాచ్‌ల ఫలితాలు, ఆటగాళ్ల ప్రదర్శనల ఆధారంగా ఐసీసీ ఈ ర్యాంకింగ్స్‎ను అప్‌డేట్ చేసింది.

నం.1 స్థానాన్ని కోల్పోయిన అఫ్గాన్ స్పిన్నర్

ఇటీవల భారత్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ పోరులో రషీద్ తన కోటా 4 ఓవర్లలో ఏకంగా 10.75 ఎకానమీతో 43 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ మ్యాచ్‌లో భారత్ భారీ తేడాతో విజయం సాధించింది. ఈ పేలవమైన ప్రదర్శన కారణంగా రషీద్ ఖాన్ తన రేటింగ్ పాయింట్లను కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అతను 735 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు.

అగ్రస్థానానికి చేరిన అబ్రార్ అహ్మద్

పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఫిబ్రవరి తర్వాత ఎలాంటి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడనప్పటికీ, రషీద్ ఖాన్ వైఫల్యం కారణంగా అతనికి ఊహించని లాభం చేకూరింది. రషీద్ పాయింట్లు తగ్గడంతో 736 రేటింగ్ పాయింట్లు ఉన్న అబ్రార్ అహ్మద్ అగ్రస్థానానికి దూసుకెళ్లి ప్రపంచ నం.1 టీ20 బౌలర్‌గా నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా 700 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకగా, ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ నాలుగో స్థానానికి, ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ ఎల్లిస్ ఐదో స్థానానికి చేరుకున్నారు.

భారత ఆటగాళ్ల స్థానాలు

భారత రికార్డులను పరిశీలిస్తే.. గాయం కారణంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన చివరి టీ20కి దూరమైన భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టాప్-5 నుంచి వెనకడుగు వేసి ప్రస్తుతం ఏడో స్థానంలో నిలిచాడు. అయినప్పటికీ భారత బౌలర్లలో ప్రస్తుతం ఆయనే బెస్ట్ రేటింగ్ కలిగి ఉన్నాడు. మరోవైపు ఇంగ్లండ్ ఆటగాడు జేమీ ఓవర్టన్ ఏకంగా 47 స్థానాలు ఎగబాకి ఆరో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అలాగే భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 12 స్థానాలు మెరుగుపరుచుకుని 639 రేటింగ్ పాయింట్లతో 15వ స్థానానికి చేరుకుని సత్తా చాటాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *