Headlines

ఇక దబిడి దిబిడే.. బస్సులో పెద్ద శబ్దంతో పాటలు పెడితే రూ. 3 లక్షల జరిమానా


లౌడ్‌గా మ్యూజిక్‌ పెడితే భారీ ఫైన్‌! బస్సులో మొబైల్‌ లేదా ఇతర పరికరాల్లో పెద్ద శబ్దంతో ఆడియో ప్లే చేస్తే 500 సింగపూర్‌ డాలర్ల వరకు జరిమానా విధించవచ్చు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.33 వేలుగా ఉంది.  బస్సు సీట్లపై కాళ్లు పెట్టడం, బస్సులో తినడం, తాగడం, చెత్త వేయడం చేస్తే ఇదే స్థాయిలో జరిమానా విధించే అవకాశం ఉంది.

ఇంకా పెద్ద తప్పు చేస్తే.. రూ.3 లక్షలకు పైగానే!

అయితే ఇంతటితో నిబంధనలు ఆగిపోలేదు. బస్‌ టెర్మినల్స్‌, ఇంటర్‌ చేంజ్‌లో ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం లేదా ప్రమాదకర పరిస్థితి సృష్టిస్తే ఏకంగా 5,000 సింగపూర్‌ డాలర్ల జరిమానా విధించవచ్చు. అంటే భారత కరెన్సీలో రూ 3.3 లక్షల వరకు ఫైన్‌ పడే అవకాశం ఉంది. అంతేకాదు బస్సు లోపల లేదా బస్‌ టెర్మినల్‌లో ఎక్కడ చెత్త వేసినా కఠిన చర్యలు ఉంటాయి.

ఇప్పటివరకు డ్రైవర్‌ చెప్పేవారు.. ఇక చట్టమే చెబుతుంది!

సింగపూర్‌లో బస్సుల్లో తినడం, తాగడం, ఇతరులకు ఇబ్బంది కలిగించే ప్రవర్తనపై గతంలోనూ కొన్ని నిబంధనలు ఉండేవి. అయితే వాటిని ప్రధానంగా బస్‌ కంపెనీలు తమ పాలసీల ద్వారా అమలు చేసేవి. డ్రైవర్‌ ప్రయాణికుడిని హెచ్చరించేవారు. అవసరమైతే బస్సు దిగాలని చెప్పేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ చర్యలు అధికారికంగా చట్టపరమైన నేరాలుగా మారడంతో.. జరిమానాలు నేరుగా విధించే అవకాశం వచ్చింది.

డ్రైవర్లకు మాత్రం ఈ అధికారం లేదు

కొత్త నిబంధనల ప్రకారం జరిమానా నోటీసులు జారీ చేసే అధికారం టికెట్‌ ఇన్‌స్పెక్టర్లు, బస్‌ ఇంటర్‌చేంజ్‌ సిబ్బందికి ఉంటుంది. అయితే బస్సు డ్రైవర్లకు అదే స్థాయి అధికారాన్ని ఇవ్వలేదు.
వారిని సింగపూర్‌లో ‘కెప్టెన్స్‌’ అని పిలుస్తారు. వారి ప్రధాన బాధ్యత బస్సును సురక్షితంగా నడపడం వరకే.

సింగపూర్‌ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్‌!

ప్రజా రవాణాలో ప్రయాణికుల హింసాత్మక ప్రవర్తనను నియంత్రించేందుకు మరికొన్ని దేశాలు కూడా దాదాపు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాయి. పోలాండ్‌లోని క్రాకోవ్‌ నగరంలో ప్రజా రవాణాలో మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా శాంతికి, ప్రశాంతతకు భంగం కలిగిస్తే జరిమానా విధించే నిబంధనలు ఉన్నాయి. బ్రిటన్‌లోనూ రైళ్లు, స్టేషన్లలో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా అనుమతి లేకుండా శబ్దం చేసే పరికరాలను ఉపయోగించడంపై నిబంధనలు ఉన్నాయి. ఇక సింగపూర్‌ ల్యాండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ ప్రకారం.. ప్రజా రవాణా అనేది అందరూ కలిసి ఉపయోగించే సర్వీస్.  ప్రతి ప్రయాణికుడు ఇతరులను గౌరవిస్తూ, ప్రశాంత ప్రయాణ వాతావరణాన్నికల్పించడంలో తన వంతుగా బాధ్యత తీసుకోవాలి. ఈ చట్టం మన దగ్గర కూడా వస్తే బస్సులలో మితిమీరి ప్రవర్తించే వారి ఆగడాలకు చెక్‌ పడుతుందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *