Headlines

Samantha: నేనే హీరో.. వాళ్లు అక్కర్లేదంటున్న సమంత

Samantha: నేనే హీరో.. వాళ్లు అక్కర్లేదంటున్న సమంత


సమంత ఇకపై హీరోయిన్‌గా నటించరా..? కమర్షియల్ సినిమాలకు దూరం అవ్వాలని ఫిక్సైపోయారా..? గ్లామర్ క్వీన్, రెగ్యులర్ హీరోయిన్ అనే మాటలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా..? ఫ్యూచర్ అంతా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు మాత్రమే చేయబోతున్నారా..? సమంత లేటెస్ట్ స్టేట్‌మెంట్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇంతకీ ఆమె ఏమన్నారో చూద్దామా..? నా సినిమాలో హీరో అక్కర్లేదు.. లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో సమంత చెప్పిన మాటలివే. ఇకపై తన సినిమాలో కథే మొదటి హీరో.. తనే హీరోయిన్.. తనే హీరో అంటూ క్లారిటీ ఇచ్చేసారు ఈ బ్యూటీ. ఈ లెక్కన లెక్కన కమర్షియల్ హీరోయిన్ క్యారెక్టర్స్‌కు బైబై చెప్పినట్లే అని అర్థమైపోతుంది. కొన్నేళ్లుగా కేవలం ఫీమేల్ సెంట్రిక్ కథలకే ఓకే చెప్తున్నారు స్యామ్. సమంత చివరగా విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. దానికి ముందు విజయ్ సేతుపతితో కాతువాకుల రెండు కాదల్ చేసారు. 2018 నుంచి ఎక్కువగా తన చుట్టూ తిరిగే సినిమాలకే ఓకే చెప్తున్నారు స్యామ్. అది చైతూతో చేసిన మజిలీ కానీ.. శర్వాతో నటించిన జాను అవ్వనీ.. ఏదైనా కథలో సమంతే కీలకంగా ఉంది. యశోద, యు టర్న్, శాకుంతలం లాంటి సినిమాలు ఫీమేల్ సెంట్రిక్ కథలే. ప్రస్తుతం నటిస్తున్న మా ఇంటి బంగారం సైతం పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ సినిమానే. ఇకపై కూడా పూర్తిగా అలాంటి కథలే చేస్తానంటున్నారు ఈ బ్యూటీ. తన సినిమాలో కథే మొదటి హీరో అవ్వాలని.. వేరే ఏ హీరో అక్కర్లేదని తేల్చేసారు సమంత. సమంత తీసుకున్న ఈ నిర్ణయంతో రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు చేయడం ఇకపై కష్టమే. కథ కుదిర్తే లేడీ ఓరియెంటెడ్ లేదంటే వెబ్ సిరీస్.. అదీ కాదంటే హాయిగా నిర్మాతగా సినిమాలు చేయాలని ఫిక్సైపోయారు ఈ బ్యూటీ. వీటితో పాటే సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ విషయంలోనూ అస్సలు కాంప్రమైజ్ కావట్లేదు స్యామ్. మరి ఈమె నిర్ణయంతో కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rakul Preet Singh: గిర్ టైగర్ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో రూల్స్ బ్రేక్ చేసిన రకుల్

పెద్ద మోసం.. జాగ్రత్త స్టార్ హీరో హెచ్చరిక

విజయ్‌ CM అయిన వేళ..త్రిషకు రూ. 12 కోట్ల జాక్ పాట్

TOP 9 ET: CM అయ్యారేమో కానీ.. అక్కడ మాత్రం ఓడిపోయారు..! | లైన్ క్లియర్ అవ్వలే

Tanikella Bharani: నేను రాముణ్ణి.. కృష్ణుణ్ణి చూడలేదు.. కానీ మోదీని చూశాను.. ! తనికెళ్ల భరిణి ఎమోషన్ పోస్ట్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *