ఈ సారి ‘బిగ్ బాస్’ ఆడియెన్స్ కోసం సరికొత్తగా ముస్తాబవుతోంది. ఇందుకోసం ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోస్టార్ ఒక భారీ ప్రణాళికను ప్రకటించింది. అదేంటంటే.. బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారిగా తెలుగుతో సహా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బంగ్లా భాషల్లో ఒకేసారి ఈ బిగ్ బాస్ రియాలిటీ షో లాంఛ్ కానుంది. ఈ విషయాన్ని జియో హాట్ స్టార్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. అంటే ఇకపై భాషల వారీగా బిగ్ బాస్‌ను చూడటానికి నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం, బంగ్లా వెర్షన్లు సెప్టెంబర్ నుంచి జియోస్టార్ టెలివిజన్ నెట్‌వర్క్ అలాగే ‘జియోహాట్‌స్టార్’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఏకకాలంలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇక తెలుగు విషయానికి వస్తే.. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 9 సీజన్లు పూర్తయ్యాయి. కాబట్టి ల్యాండ్ మార్క్ సీజన్ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తారని జియో హాట్ స్టార్ ప్రకటించింది. ఇక కన్నడ వెర్షన్‌కు కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్, తమిళంలో విజయ్ సేతుపతి, మలయాళంలో మోహన్‌లాల్ యధావిధిగా హోస్ట్‌లుగా కొనసాగుతారు. ఈసారి మరో విశేషం ఏమిటంటే, భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ బెంగాలీ బిగ్ బాస్ ఎడిషన్ కు కొత్త హోస్ట్‌గా వస్తున్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jabardasth: జబర్దస్త్‌లోకి స్టార్ కమెడియన్.. రీ ఎంట్రీ.. ఇక పంచ్‌లతో రచ్చ రచ్చే!
Chiranjeevi: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికీ చిరు నుంచి దిమ్మతిరిగే బర్త్ డే కానుక
Balakrishna: బాలయ్య హెల్త్ అప్‌డేట్.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే..
Bigg Boss Telugu: ‘ప్రతి 10 మందిలో.. 8 మంది బిగ్ బాస్‌ను చూస్తున్నారా..’ పిచ్చెక్కిస్తున్న రియల్ టైం డాటా..