Headlines

Gold Price Today: మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. రెండు రోజుల్లో తులంపై ఎంత పెరిగిందంటే..

Gold Price Today: మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. రెండు రోజుల్లో తులంపై ఎంత పెరిగిందంటే..


పసిడి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొంతకాలంగా రికార్డు స్థాయిలతో సామాన్యులకు చుక్కలు చూపించిన ధరలు.. ఇటీవల తగ్గుముఖం పట్టాయి.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుండటం.. ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్-అమెరికా యుద్ధం అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు.. డాలర్, రూపాయి విలువ మారకం ప్రభావంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సోమవారం, మంగళవారం ధరలు పెరిగాయి.. రెండు రోజుల్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై దాదాపు రూ.1000 మేర ధర పెరిగింది. తాజాగా కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి..

పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా బుధవారం (జులై 22) ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధరపై రూ.10 మేర పెరిగి.. రూ.1,44,230 గా ఉంది.

22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.10 మేర పెరిగి రూ.1,32,210 గా ఉంది.

వెండి కిలో ధరపై రూ.100 మేర తగ్గి.. రూ.2,34,900 లుగా కొనసాగుతోంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *