Headlines

Gold Price Today: బంగారం కొనే వారికి గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన పసిడి ధరలు.. తులం ఎంతంటే?

Gold Price Today: బంగారం కొనే వారికి గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన పసిడి ధరలు.. తులం ఎంతంటే?


Gold Price Today: బంగారం కొనే వారికి గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన పసిడి ధరలు.. తులం ఎంతంటే?

గత కొన్ని రోజులుగా ఉరుకులు పెడుతున్న బంగారం, వెండి ధరలకు సడెన్ బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,52,235 వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల ధర రూ.1,39,650 వద్ద ట్రేడవుతుంది. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తూ కిలోకు రూ. 2,62,350 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్నం సహా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు

  • హైదరాబాద్‌లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,52,350, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,650 ఉంది. వెండి కిలో ధర రూ.2,62,350గా ఉంది.
  • విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,52,350, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,650 ఉంది.
  • ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,53,010, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,40,260 ఉంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,52,350,, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,650 ఉంది.
  • కోల్‌కత్తాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,52,350, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,650 ఉంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,370,గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,500గా ఉంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,52,500, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ1,39,800 వద్ద కొనసాగుతుంది.

రాబోయే రోజుల్లో ధరలు పెరిగే ఛాన్స్

మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను బంగారం వైపు మళ్ళిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వస్తువుల ధరలు, కరెన్సీ విలువ తగ్గడం వంటి కారణాల వల్ల సురక్షితమైన పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. అయితే పశ్చిమాసియా ఉత్రిక్తల నేపథ్యంలో ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగాయి. అయితే ఆయిల్ రేట్స్ పెరిగినప్పుడు సాధారణంగా బంగారం ధరలు కూడా ప్రభావితమవుతాయి. కాబట్టి నిపుణుల ప్రకారం, రాబోయే రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 2 లక్షల మార్కును కూడా తాకవచ్చని చెబుతున్నారు. అయితే మీరు నగలు చేయించుకోవాలనుకుంటే, ధర కొంచెం తగ్గినప్పుడు కొనడం మంచిది. అదే పెట్టుబడి కోసం అయితే, దీర్ఘకాలికంగా 5-10 ఏళ్లు బంగారం ఎప్పుడూ లాభదాయకమే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *