బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల తగ్గినట్లే తగ్గిన పసిడి ధరలు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి.. ముఖ్యంగా.. ఇరాన్-అమెరికా యుద్ధం అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు.. ముడి చమురు ధరలు పెరుగుతుండటం, తదితర పరిణామాల వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా.. మూడు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరిగాయి.. బుధవారం ఒక్కరోజే.. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై దాదాపు రూ.2,300ల వరకు ధర పెరిగింది. సోమవారం నుంచి 3వేలకు పైగా ధర పెరిగింది. వెండి పై దాదాపు 5వేల మేర పెరిగింది. అయితే.. తాజాగా కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి..
పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా గురువారం (జులై 24) ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధరపై రూ.10 మేర పెరిగి.. రూ.1,46,520 గా ఉంది.
22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.10 మేర పెరిగి రూ.1,34,310 గా ఉంది.
వెండి కిలో ధరపై రూ.100 మేర పెరిగి.. రూ.2,40,100 లుగా కొనసాగుతోంది.
అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.