వలస కార్మికులు, విద్యార్థులు, అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారికి ఈ చిన్న సిలిండర్లు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కంపెనీ ఛోటు పేరుతో, భారత్ పెట్రోలియం భారత్ గ్యాస్ మినీ, హిందూస్థాన్ పెట్రోలియం హెచ్పీ గ్యాస్ అప్పు పేరుతో ఈ సిలిండర్లను తీసుకొచ్చాయి. సమీపంలోని గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి వీటిని కొనుగోలు చేయవచ్చు.