Asha Bhosle: ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం

Asha Bhosle: ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం


లెజెండరీ సింగర్‌ ఆశా భోంస్లే అస్వస్థతతో ఆస్పత్రిలో చేరగానే.. ఆశా భోంస్లే మరణించారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. కొన్ని న్యూస్‌ ఛానెళ్లు కూడా ఆ తప్పుడు వార్తను ప్రసారం చేశాయి. పాకిస్తాన్‌కు చెందిన ‘జియో న్యూస్’ కూడా ఈ వదంతులను ఆధారంగా చేసుకుని ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ఆశా భోంస్లే మరణవార్తను కవర్‌ చేసే క్రమంలో ఆమె పాడిన సూపర్‌ హిట్‌ పాటలను ప్లే చేసింది. అలాగే భారతీయ సినిమాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను కూడా ఛానల్‌లో ప్రసారం చేసింది. పాకిస్తాన్ మీడియా నిబంధనల ప్రకారం భారతీయ కంటెంట్‌ను ప్రసారం చేయడం నిషిద్దం. తప్పుడు వార్తను ప్రసారం చేయడమే కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా భారతీయ వీడియోలను ప్రదర్శించడంపై పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ – పెమ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.సదరు న్యూస్‌ ఛానల్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. దీనిపై ఏడు రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని జియో న్యూస్ యాజమాన్యాన్ని పెమ్రా ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత సమయంలోగా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకుంటే ఛానల్‌పై భారీ జరిమానా లేదా లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలోనే పెమ్రా నోటీసులపై జియో న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ అజార్ అబ్బాస్ రియాక్టయ్యాడు. భారతీయ పాటలను ప్రసారం చేయడాన్ని సమర్థించుకున్నారు. ఒక కళాకారుడి జీవితంపై వార్తలు రాసేటప్పుడు, వారు సాధించిన విజయాలను గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రముఖ కళాకారుల గురించి వార్తలు రాసేటప్పుడు, వారి కృషిని కీర్తించడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోందన్నాడు

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Singer Mangli: నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??

Vishnu Priya: అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??

Dacoit: కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *