Telangana: EMI కట్టలేదని ఇంత దారుణమా?.. వికలాంగుడని కూడా చూడకుండా..

Telangana: EMI కట్టలేదని ఇంత దారుణమా?.. వికలాంగుడని కూడా చూడకుండా..


Telangana: EMI కట్టలేదని ఇంత దారుణమా?.. వికలాంగుడని కూడా చూడకుండా..

ఈఎమ్ఐలు కట్టట్లేదని ఓ ప్రైవేట్ బ్యాంక్ సిబ్బంది వికలాంగుడి ఇంటికి తాళం వేసిన సీజ్ చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల పట్టణంలో వెలుగు చూసింది. ఇందిరానగర్‌కు చెందిన భోగం గోపాల్ అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం తన ఇంటిని తాకట్టు పెట్టి కరీంనగర్‌లోని ఐకేఎఫ్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.8 లక్షలు రుణంగా తీసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గోపాల్ ఇప్పటి వరకు క్రమంగా ఈఎంఐలు చెల్లిస్తూ వచ్చాడు. అయితే మూడేళ్ల క్రితం షుగర్ వ్యాధి బారిన పడిన గోపాల్ ఆరోగ్యం క్షీణించడంతో ఏడాది క్రితం వైద్యులు అతని కాలు తొలగించారు. అయినప్పటికీ కుటుంబ పోషణతో పాటు రుణ చెల్లింపులు కొనసాగించాడు. ఇటీవల ఆరోగ్య సమస్యల కారణంగా నాలుగు ఈఎంఐలు మాత్రమే చెల్లించలేకపోయాడు.

అయితే నాలుగు రోజుల క్రితం బ్యాంకు సిబ్బంది ఇంటికి వచ్చి రుణం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం మరోసారి వచ్చిన సిబ్బంది ఒక్కసారి బయటికి రండి.. ఒకసారి ఇంటికి తాళం వేసి ఫోటో తీసుకుంటామని చెప్పి కుటుంబాన్ని బయటకు పంపించి, అనంతరం ఇంటికి తాళం వేసి నోటీసులు అంటించి వెళ్లిపోయినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో గోపాల్ కుటుంబం ఒక్కసారిగా ఆశ్రయం కోల్పోయి రోడ్డున పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు స్పందించి తాత్కాలికంగా టెంట్ ఏర్పాటు చేయగా, తర్వాత బంధువులు వారిని ఎల్లారెడ్డిపేటకు తరలించారు.

గోపాల్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, కొంత సమయం ఇవ్వాలని ఎంత బతిమాలినా బ్యాంకు సిబ్బంది స్పందించలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *