ఇదేంది ఇంత ఉంది..! అనకొండకు అక్క అయ్యుంటుంది.. చూస్తే వణకాల్సిందే

ఇదేంది ఇంత ఉంది..! అనకొండకు అక్క అయ్యుంటుంది.. చూస్తే వణకాల్సిందే


ఎండలు మండిపోతున్నాయి.. దీంతో పాములు జనవాసాల్లోకి వస్తున్నాయి.. ఎండ వేడి తట్టుకోలేక.. పాములు ఇళ్లల్లోకి ప్రవేశిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోలా తాలూకాలోని హలవల్లి గ్రామంలో ఒక భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సుమారు 16 అడుగుల పొడవున్న ఈ కొండచిలువ ఒక ఇంట్లో తిష్టవేసింది.. దీన్ని చూసి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు.. గ్రామస్తులు సైతం ఆందోళన చెందారు.. ఈ విషయం తెలుసుకున్న వెంటనే.. స్థానికులు స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ సూరజ్ శెట్టి అరబైల్, హరీష్ మడివాళ అటవీ శాఖ అధికారుల సహకారంతో ఆపరేషన్ ప్రారంభించారు. ఇంటిలోని ఇరుకైన ప్రదేశంలో నక్కి ఉన్న ఆ పామును ఎవరికీ ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తగా పట్టుకున్నారు.

పట్టుబడిన 16 అడుగుల పొడవున్న పామును, అటవీ శాఖ మార్గదర్శకాల ప్రకారం జనావాసాలు లేని దట్టమైన అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలివేశారు. పామును రక్షించి, తిరిగి అడవిలోకి వదిలినందుకు సూరజ్ శెట్టి, అతని బృందాన్ని గ్రామస్తులు అభినందించారు. ఇటీవల మల్నాడు, తీర ప్రాంతాలలో వేడి వాతావరణం పెరగడం వల్ల, చల్లని ప్రదేశాల కోసం పాములు జనావాస ప్రాంతాలకు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

వీడియో చూడండి..

అయితే.. ఇలాంటి పాములు కనిపిస్తే.. దాడి చేయకుండా వెంటనే సమాచారం అందించాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *