ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్ న్యూ్స్. త్వరలోనే ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త పోర్టల్ తీసుకురానుంది. ఇనాక్టివ్ అయిన పీఎఫ్ ఖాతాలను తిరిగి పునరుద్దరించుకునేందుకు, పాత అకౌంట్లను గుర్తించేందుకు ఈ ఫ్లాట్‌ఫామ్ సహాయపడనుంది. ఇ-ప్రాప్తి పేరుతో ఈ కొత్త వెబ్‌సైట్ తీసుకురానున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రకటించారు. త్వరలోనే దీనిని లాంచ్ చేయనున్నట్లు వెల్లడించారు.