Sarkar 10 Episode : సర్కార్ షోలో మల్లారెడ్డి సందడి.. సుడిగాలి సుధీర్ పై పంచులు.. డ్యాన్సులు.. స్ట్రీమింగ్..

Sarkar 10 Episode : సర్కార్ షోలో మల్లారెడ్డి సందడి.. సుడిగాలి సుధీర్ పై పంచులు.. డ్యాన్సులు.. స్ట్రీమింగ్..


తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ‘ఆహా’ (Aha) ఓటీటీలో అత్యంత ప్రజాదరణ పొందిన గేమ్ షోలలో ‘సర్కార్’ (Sarkaar) ఒకటి. సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో, తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం సీజన్ 6 విజయవంతంగా కొనసాగుతుండగా, తాజాగా 10వ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఎపిసోడ్‌కు గెస్ట్‌లుగా వచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా వచ్చారు. సాధారణంగానే మల్లారెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సందడి నెలకొంటుంది. తనదైన మేనరిజంతో, మాటతీరుతో అందరినీ ఆకట్టుకునే ఆయన, ఇప్పుడు సర్కార్ వేదికపై సుధీర్‌తో కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

ఎక్కువ మంది చదివినవి : Actress : ఎన్టీఆర్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. అప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

మల్లారెడ్డి వేసిన పంచ్‌లు, ఆయన చెప్పిన డైలాగులు చూస్తుంటే ఈ ఎపిసోడ్ ఫుల్ మీల్స్ లాంటి ఎంటర్టైన్మెంట్ అందించబోతోందని అర్థమవుతోంది. సుధీర్‌ను ఉద్దేశించి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. ముఖ్యంగా సుధీర్ పెళ్లి గురించి, ఆయన క్రేజ్ గురించి మల్లారెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా, ఈ ఎపిసోడ్‌లో గెస్ట్‌లు భారీ మొత్తంలో నగదు గెలుచుకోవడానికి పోటీ పడ్డారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : కొబ్బరికాయ కుళ్లిపోయిందని ఆగిపోయిన సినిమా.. బాలయ్య, పవన్ ఆ మూవీ చూసుంటేనా.. డైరెక్టర్ కామెంట్స్..

ప్రస్తుతం ఈ 10వ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి సరదాగా గడపాలనుకునే వారికి ఈ షో ఒక బెస్ట్ ఆప్షన్.  తమ ఫేవరెట్ సెలబ్రిటీల అల్లరిని చూడాలనుకునే వారు ఈ ఎపిసోడ్‌ను అస్సలు మిస్ అవ్వకండి.

ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy: శ్రీకాంత్‏తో మూవీ తీస్తున్నప్పుడు.. ఆయన ఏదో నాకు ఫేవర్ చేస్తున్నట్లు చెప్పాడు.. జేడీ చక్రవర్తి..

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: అతడు గొప్ప నటుడు.. నా జీవితంలో అలాంటి హీరోను చూడలేదు.. నా లైఫ్ పూర్తిగా మార్చేశాడు.. తనికెళ్ల భరణి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *