MPL Women Scindia Cup 2026: సింధియా కప్ సమరానికి సై.. ఐదు జట్ల ఫైనల్ స్క్వాడ్స్ ఇవే..

MPL Women Scindia Cup 2026: సింధియా కప్ సమరానికి సై.. ఐదు జట్ల ఫైనల్ స్క్వాడ్స్ ఇవే..


భారత మహిళా క్రికెట్ గతిని మార్చే మరో అద్భుతమైన లీగ్ సమరానికి రంగం సిద్ధమైంది. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహిళల సింధియా కప్ ఇప్పుడు క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. మహిళా క్రీడాకారిణులకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే లక్ష్యంతో ప్రారంభమైన ఈ లీగ్‌లో మొత్తం ఐదు శక్తివంతమైన జట్లు తలపడుతున్నాయి. ఈ ఐదు ఫ్రాంచైజీలు తమ ప్లేయర్ల ఎంపికను పూర్తి చేశాయి. టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్, యువ సంచలనం సౌమ్య తివారీ వంటి హేమాహేమీలు ఈ టోర్నీలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.

చంబల్ ఘరియల్స్

స్టార్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ ఈ జట్టుకు ఐకాన్ ప్లేయర్‌గా వ్యవహరిస్తున్నారు. సీనియర్, యువ క్రీడాకారిణులతో ఈ జట్టు సమతుల్యంగా ఉంది.

ప్రధాన ప్లేయర్లు: పూజా వస్త్రాకర్, రహీలా ఫిర్దౌస్ , జిన్సీ జార్జ్ , అదితి పన్వర్.

టీమ్ సభ్యులు: అవ్ని టేటర్, అదితి తివారీ, కనిష్క ఠాకూర్, ధని బుచాడే, అనామిక రఘువంశీ, వైష్ణవి సింగ్, పూర్వి ఖానా, సోమియా అలీ అన్సారీ, రచన యాదవ్, ఖ్యాతి శుక్లా, సిద్ధి దూబే.

భోపాల్ వోల్వ్స్

భోపాల్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.

ప్రధాన ప్లేయర్లు: ఆయుషి శుక్లా, సంస్కృతి గుప్తా , హన్షిక కిరార్ .

ఇతర సభ్యులు: అంజలి పాటిదార్, సాన్వి భావ్సర్, ప్రియాంక కౌశల్, తమన్నా చౌదరి, రోషని కుమారి, కాజల్, వైష్ణవి వ్యాస్, రిషిత పరిహార్, జాన్వీ రాజ్‌పుత్, రీనా యాదవ్, అంశులా రావు, వంశిక ప్రజపతి.

గ్వాలియర్ షెర్నిస్

అండర్-19 వరల్డ్ కప్ స్టార్ సౌమ్య తివారీ ఈ జట్టుకు ఐకాన్ ప్లేయర్. లోకల్ ఫేవరెట్‌గా ఈ జట్టు బరిలోకి దిగుతోంది.

ప్రధాన ప్లేయర్లు: నుజహత్ పర్వీన్, సౌమ్య తివారీ, క్రాంతి గౌడ్.

ఇతర సభ్యులు: ఖుషీ యాదవ్, అనాది తాగడే, ఆష్నా పాటిదార్, శ్రేయ దీక్షిత్, జియా జెత్వా, తన్వీ ఉపాధ్యాయ్, ఇషానా స్వామి, రియా యాదవ్, ఉన్నతి బాగోరా, సాక్షి పాచోర్.

రాయల్ నిమార్ ఈగిల్స్

నిమార్ ఈగిల్స్ జట్టు యువ రక్తం, ఫాస్ట్ ప్లేయర్లతో దూకుడుగా కనిపిస్తోంది.

ప్రధాన ప్లేయర్లు: నికితా సింగ్, వైష్ణవి శర్మ .

ఇతర సభ్యులు: సోనియా సింగ్, యామిని బిల్లోర్, కళ్యాణి జాదవ్, తనిష్క సేన్, రిషికా జైన్, దీప్తి సింగ్, ముస్కాన్ యోగి, ఖుషీ యాదవ్, జాన్వీ రాయ్, లక్షిత మాహే, హర్షిత సింగ్.

బుందేల్‌ఖండ్ బుల్స్

అనుభవం కలిగిన ప్లేయర్లను రిటైన్ చేసుకోవడం ద్వారా ఈ జట్టు వ్యూహాత్మక బలాన్ని పొందింది.

ప్రధాన ప్లేయర్లు: శుచి ఉపాధ్యాయ్, అనుష్క శర్మ , ముస్కాన్ బిస్వాస్.

ఇతర సభ్యులు: దక్షిణిత యాదవ్, మాయా మార్స్కోలే, అనన్య దూబే, సుహాని శర్మ, సుదితి వశిష్ట, మహి ఠాకూర్, హనీ యాదవ్, యశశ్విని బి, ఖ్యాతి జైన్, దిశ శర్మ, పాయల్ బాల్మిక్, వైదేహి రాజ్‌పుత్.

ప్లేయర్లను ఐకాన్, రిటైన్డ్ , ప్రొమిసింగ్ డెవలప్‌మెంట్ ప్లేయర్స్, A, B, C కేటగిరీలుగా విభజించి జట్లను రూపొందించారు. ప్రతి జట్టుకు గరిష్టంగా 15 మంది క్రీడాకారిణులను అనుమతించారు. మధ్యప్రదేశ్‌లోని ప్రతిభావంతులైన మహిళా క్రికెటర్లకు డబ్ల్యూపీఎల్తరహాలో ఒక వేదిక కల్పించి, వారిని జాతీయ స్థాయికి చేర్చడమే ఈ లీగ్ ఉద్దేశం. గ్వాలియర్‌లోని అత్యున్నత వసతులు కలిగిన నూతన క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్‌లు నిర్వహించబడుతున్నాయి.

మహిళా క్రికెట్‌కు ఊతం

గతంలో కేవలం పురుషులకే పరిమితమైన ఎంపీఎల్, ఇప్పుడు మహిళల కోసం సింధియా కప్‌ను తీసుకురావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తరహాలోనే, ఈ లీగ్ ద్వారా మధ్యప్రదేశ్ నుండి జాతీయ జట్టుకు ఆడే క్రికెటర్లు తయారవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *