దేవర సినిమా హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు యమాగా ట్రెండ్ అవుతోంది. ఓ వైపు జాన్వీ, ఇంకో వైపు మహేష్ అండ్ జక్కన్న.. అందరూ కలిసి కొరటాల సినిమాకు చాలానే హెల్ప్ చేస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు దేవర ఎందుకు ట్రెండ్ అవుతున్నట్టు? వీళ్లందరూ ఎందుకు సాయం చేస్తున్నట్టు? ఫస్ట్ పార్టులోమీరు చూసింది జస్ట్ ఫియరే. పవర్ అండ్ రివెంజ్ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలంటే సెకండ్ పార్టుని అస్సలు మిస్ కాకూడదంటూ దేవర సీక్వెల్ మీద హైప్ పెంచేస్తున్నారు మేకర్స్. దీనికి తోడు దేవర సెట్స్ లో వారణాసి షూట్ అంటూ మరో వార్త వైరల్ అవుతోంది. దేవరలో అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం వేసిన సెట్లో ఇప్పుడు మహేష్ వారణాసి షూటింగ్ జరుగుతుందన్నది న్యూస్. కొరటాల చేసిన సెట్టింగ్‌ని జక్కన్న ఎఫిషియంట్‌గా వాడుకుంటున్నారంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు. ఓ వైపు వారణాసి వార్తలతో దేవర వైరల్ అవుతోంటే, మరోవైపు తారక్ లేటెస్ట్ లుక్‌కి జాన్వీ పెట్టిన కామెంట్ కూడా వైరల్ అవుతోంది. దేవరకి తంగం మామూలు సపోర్ట్ చేయడం లేదంటున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు చేస్తు్న్న నీల్ సినిమా పూర్తయితేగానీ, దేవర సీక్వెల్ మీద కాన్సెన్ట్రేట్ చేయరు తారక్. ఫస్ట్ పార్టుతో పోలిస్తే సెకండ్ పార్టులో తారక్ బీస్ట్ అవతార్ కనిపిస్తుందనే హోప్స్ కూడా భీభత్సంగా ఉన్నాయి. సో ఆఫ్టర్ నీల్ మూవీ, ఈ సినిమా కోసం తారక్ మేకోవర్కి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో మృత్యు ఘంటికలు.. వడదెబ్బకు ముగ్గురు బలి
Srelelela: టాప్‌లో ట్రెండ్ అవుతున్న ఇద్దరు హీరోయిన్లు
Salman Khan: వంశీ పైడిపల్లి మీదే హోప్స్ పెట్టుకున్న భాయీజాన్
స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్న వ్యక్తి.. అంతలోనే..
సామాన్య పాస్టర్ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు