Delhi Capitals vs Royal Challengers Bengaluru: ఐపీఎల్ 2026లో భాగంగా 39వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈమేరకు టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తమ గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 264 పరుగులు చేసినప్పటికీ ఓడిపోయింది.
కాగా, ఈ రెండు జట్ల మధ్య ఈ సీజన్‌లో రెండవ మ్యాచ్ జరగనుంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో బెంగళూరు రెండో స్థానంలో ఉండగా, ఢిల్లీ ఏడో స్థానంలో ఉంది.
బెంగళూరుదే పైచేయి..
ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 34 మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో ఆర్‌సీబీ 19 గెలవగా, ఢిల్లీ 13 గెలిచింది. ఒక మ్యాచ్ టై కాగా, మరొకటి ఫలితం తేలలేదు. గత సీజన్‌లో ఇవీ రెండు మ్యాచ్‌లు ఆడగా, ఒకదానిలో ఢిల్లీ, మరొకదానిలో బెంగళూరు విజయం సాధించాయి.
అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ నివేదిక..
ఐపీఎల్‌లో అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌గా పరిగణిస్తుంటారు. చిన్న బౌండరీల కారణంగా ఇక్కడ అధిక స్కోరింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి.
ఈ పిచ్‌పై 99 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో, మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 48 సార్లు గెలుపొందగా, ఛేజింగ్ చేసిన జట్టు 50 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ రద్దయింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..