Dmart Shopping Tips: డీమార్ట్‌లో షాపింగ్‌కు వెళుతున్నారా..? ఈ 3 పనులు చేస్తే భారీగా డబ్బులు ఆదా.. వేస్ట్ ఖర్చులు ఉండవ్..

Dmart Shopping Tips: డీమార్ట్‌లో షాపింగ్‌కు వెళుతున్నారా..? ఈ 3 పనులు చేస్తే భారీగా డబ్బులు ఆదా.. వేస్ట్ ఖర్చులు ఉండవ్..


Dmart Shopping Tips: డీమార్ట్‌లో షాపింగ్‌కు వెళుతున్నారా..? ఈ 3 పనులు చేస్తే భారీగా డబ్బులు ఆదా.. వేస్ట్ ఖర్చులు ఉండవ్..

నెలవారీ సరుకుల కోసం చాలామంది డీమార్ట్‌కు వెళుతుంటారు. నెలకు సరిపోయే సరుకులను ఒకేసారి కొనుగోలు చేస్తారు. డీమార్ట్‌లో అనేక వస్తువులపై వన్ ప్లస్ వన్, భారీ ఆఫర్లు, డిస్కౌంట్స్ అందుబాటులో ఉంటాయి. దీంతో తక్కువ ధరకే ఇంట్లోకి అవసరమయ్యే ప్రతీ వస్తువు ఒకేచోట లభిస్తుంది. అందుకే డీమార్ట్‌కు వెళ్లి షాపింగ్ చేసేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. అయితే ఆఫర్లను చూసి ఆకర్షితులై చాలామంది ఏది పడితే అది అవసరం లేకపోయినా కొనుగోలు చేస్తుంటారు. దీని వల్ల బిల్లు పెరిగిపోతుంది. కానీ చిన్న చిట్కాలు పాటించడం వల్ల డబ్బులు భారీగా ఆదా చేసుకోవచ్చు. అదెలానో చూడండి.

యాప్‌లో ధరలు చెక్ చేసుకోండి

ప్రస్తుతం డీమార్ట్ యాప్ అందుబాటులో ఉంది. మీరు షాపింగ్‌కు వెళ్లేముందు ఒకసారి యాప్‌లో ధరలు చెక్ చేసుకోండి. మీకు ఇంట్లోకి ఏ వస్తువులైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో వాటి ధరలు చెక్ చేయండి. కొన్నిసార్లు స్టోర్‌లో కంటే యాప్‌లోనే ధరలు తక్కువగా ఉంటాయి. అలాగే యాప్‌లో అనేక ఆఫర్లు కూడా ఉంటాయి. దీని వల్ల మీరు స్టోర్‌కు వెళ్లడం కంటే ఆన్‌లైన్‌లోనే షాపింగ్ చేయడం వల్ల డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ ప్రయాణ ఖర్చులు, సమయం కూడా ఆదా అవుతాయని చెప్పవచ్చు.

డీమార్ట్ సొంత బ్రాండ్స్

డీమార్ట్‌లో ఇంటర్నేషన్ బ్రాండ్స్ నుంచి లోకల్ బ్రాండ్ల వస్తువుల వరకు అన్నీ అందుబాటులో ఉంటాయి. అయితే డీమార్ట్ సొంత బ్రాండ్ల వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి. మిగతా బ్రాండ్లతో పోలిస్తే స్వంత బ్రాండ్ల ధరలు కాస్త తక్కువగా ఉంటాయి. మిగతా ప్రీమియం బ్రాండ్ల కంటే వీటి ధరలు 20 నుంచి 40 శాతం వరకు తక్కువగా ఉంటాయి. అలాగే ఈ వస్తువుల క్వాలిటీ కూడా మెరుగ్గానే ఉంటుంది. ఇక డీమార్ట్ సొంత బ్రాండ్ కలిగిన ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అలాగే డీమార్ట్‌లో ఆఫర్లను చూసి చాక్లెట్లు, బిస్కెట్లు లాంటి వాటిని ఎక్కువగా కొనుగోలు చేసి డబ్బులు వృధా చేసుకోవద్దు.

షెల్ప్‌లు గమనించండి

డీమార్ట్‌లో ఎక్కువ ధర కలిగిన వస్తువులను మీ కంటికి కనిపించే ఎత్తులో ఉంచుతారు. ధరలు తక్కువ, డిస్కౌంట్స్ ఉన్న వస్తువులను కింద, పైన షెల్పుల్లో ఉంచుతారు. ఇక ఎండ్ షెర్పులు, చివరి వరుసలో ఉన్న షెర్పుల్లో భారీ డిస్కౌంట్‌తో కూడిన వస్తువులను పెడుతూ ఉంటారు. ఇక క్లియరెన్స్, ప్రమోషన్ సేల్ పేరిట భారీ ఆఫర్లను ఇస్తూ ఉంటారు. డీమార్ట్‌లో షాపింగ్ చేసేటప్పుడు వీటిని గమనించండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *