కస్టమర్లను అభిరుచులను అంచనా వేస్తూ టెలికం కంపెనీలు ఎప్పటికప్పుడూ సరికొత్త ఆఫర్స్ తీసుకొస్తూ ఉంటాయి. తాజాగా యూత్, అండ్ గేమింగ్ లవర్స్‌ను ఆకట్టుకునేందుకు రిలాన్స్ జియో కూడా యూత్ అండ్ గేమింగ్ పేరుతో ఒక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ. 459 తో కస్టమర్లకు అందుబాటులోకి వచ్చిన ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 2GB హై-స్పీడ్ డేటా వస్తుంది. దీనితో పాటు అదనంగా 5GB బోనస్ డేటా లభిస్తుంది. మొత్తం కలిపి 61GB డేటా వస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు వంద ఉచిత SMSలు పొందవచ్చు. అయితే తక్కువ సమయంలో ఎక్కువ డేటాను ఉపయోగించే వారికి ఇది ఒక అద్భుతమైన ప్యాకేజీ అవుతుంది.
ఈ ప్యాకేజ్ ప్రత్యేకలు ఏంటంటే?
మీరు రూ.459 పెట్టి రిఛార్జ్ చేసుకుంటే.. మీ రోజువారీ 2GB కోటా అయిపోనా కూడా అదనంగా ఇచ్చిన 5GB డేటా మీకు యూజ్ అవుతుంది. మీ రీచార్జ్ ప్లాన్ అయిపోయే లోపు ఒకసారి మాత్రమే మీరు దీన్ని పొందచ్చు. అలాగే గేమింగ్ ప్రియుల కోసం జియో గేమ్స్ , క్రీడాభిమానుల కోసం ఫ్యాన్‌కోడ్ కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. అలాగే ఈ ప్లాన్‌లో స్నాప్‌చాట్ ప్లస్, సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు స్నాప్‌చాట్‌లోని ప్రీమియం ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. మూవీ లవర్స్ కోసం జియో టీవీ , జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ కూడా ఉంటుంది.
ఒక్క ప్లాన్‌తో ఇన్ని ఆఫర్స్
అయితే ఈ ప్లాన్ తీసుకున్న వారికి 3 నెలల పాటు జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అలాగే డేటా స్టోరేజ్ కోసం 50GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. వీటితో పాటు 18 నెలల పాటు గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఎక్కువగా ఏఐని వాడేవారికి ఇది చాలా మంచి అవకాశం. అయితే ఈ ప్రయోజనాలన్నీ మీ జియో నంబర్‌తో లాగిన్ అయినప్పుడు, మీ మెయిన్ ప్లాన్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.