Headlines

CWG 2026: గోల్డ్ చేజారినా గర్వంగా నిలిచిన లవ్లీనా.. ఒక్కరోజులో భారత్‌కు 6 పసిడి పతకాలు

CWG 2026: గోల్డ్ చేజారినా గర్వంగా నిలిచిన లవ్లీనా.. ఒక్కరోజులో భారత్‌కు 6 పసిడి పతకాలు


CWG 2026: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026 మహిళల 75 కేజీల కేటగిరీ బాక్సింగ్ ఫైనల్లో భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ తీవ్రంగా శ్రమించినప్పటికీ ఓటమి పాలైంది. అభిమానులందరూ లవ్లీనా బంగారం గెలుస్తుందని ఆశించినప్పటికీ ఆమె రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ ఎమ్మా-సూ గ్రీన్ ట్రీతో లవ్లీనా తలపడింది.

హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్

ఆస్ట్రేలియా బాక్సర్ ఎమ్మా తన అద్భుతమైన ఫుట్‌వర్క్, క్రాస్ పంచ్‌లతో తొలి రౌండ్ నుంచే లవ్లీనాపై ఒత్తిడి పెంచింది. దీంతో మొదటి రౌండ్‌ను ఎమ్మా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. రెండవ రౌండ్‌లో లవ్లీనా పుంజుకుని కొన్ని మంచి పంచ్‌లు విసిరినప్పటికీ, ఆసీస్ బాక్సర్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. చివరికి 4-1 తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుని ఎమ్మా గోల్డ్ సాధించగా, లవ్లీనా సిల్వర్ దక్కించుకుంది. లవ్లీనా మ్యాచ్‌కంటే ముందే భారత్‌కు బాక్సింగ్‌లో 5 గోల్డ్ మెడల్స్ రాగా, ఆమె మ్యాచ్ తర్వాత మరొక గోల్డ్ కూడా లభించింది.

శనివారం రోజున మెరిసిన ఆరుగురు పసిడి వీరులు

లవ్లీనా మ్యాచ్ ముగిసినప్పటికీ, శనివారం నాటి బాక్సింగ్ పోటీలు భారత క్రీడా రంగానికి బంగారు దినంగా నిలిచాయి. ఏకంగా ఆరుగురు భారత బాక్సర్లు పసిడి పతకాలను ముద్దాడారు.

ప్రియాంక/ప్రీతి పవార్

జైస్మిన్ లాంబోరియా

సాక్షి చౌదరి

ప్రియా ఘంఘాస్

అరుంధతి చౌదరి

సచిన్ సివాచ్

ఈ ఆరుగురి అద్భుత ప్రదర్శనతో బాక్సింగ్ రింగ్‌లో భారత్ జయకేతనం ఎగురవేసింది.

పతకాల పట్టికలో భారత్ సునామీ జంప్

శనివారం మ్యాచ్‌లు ప్రారంభం కావడానికి ముందు భారత్ పతకాల పట్టికలో 10వ స్థానంలో ఉండేది. అయితే ఒకే రోజు లభించిన 6 స్వర్ణ పతకాలతో భారత్ ఏకంగా 4వ స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు భారత్ ఖాతాలో మొత్తం 36 పతకాలు చేరాయి. ఇందులో 12 స్వర్ణాలు, 16 రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి. ప్రస్తుతం 61 గోల్డ్, మొత్తం 147 పతకాలతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలవగా, 23 గోల్డ్స్‌తో ఇంగ్లాండ్ రెండో స్థానంలో, 18 గోల్డ్స్‌తో కెనడా మూడో స్థానంలో ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *