హాస్యనటుడిగా, నటుడిగా సుపరిచితులైన జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి.. ఇప్పుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తన కొత్త సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభి.. తన సినీ ప్రయాణం, దర్శకులు అనిల్ రావిపూడి, ఎస్.ఎస్. రాజమౌళిలతో తన అనుబంధం గురించి ఇటీవల వైల్డ్ వోల్ఫ్ తెలుగుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ ఎదుగుదలకు సంబంధించి, వ్యక్తిగత స్వభావానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అదిరే అభి, అనిల్ రావిపూడిల స్నేహం సినీ రంగంలో దాదాపు ఒకేసారి ప్రారంభమైంది. అభి నటనా రంగంలోకి వచ్చిన తర్వాత, అనిల్ రావిపూడి దర్శకుడు అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన గౌతమ్ ఎస్.ఎస్.సి సినిమాకు అప్రెంటిస్‌గా జాయిన్ అయ్యారు. ఆ చిత్రంలో అభి హీరో నవదీప్ స్నేహితుడి పాత్రలో నటించారు. అప్పటి నుంచే వారిద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఇటీవల విడుదలైన తన కర్మాకియా ట్రైలర్‌ను చూసిన తర్వాత అనిల్ రావిపూడి అభినందించారని, “చాలా బాగుంది, ఎక్సయిటెడ్గా, థ్రిల్లింగ్‌గా ఉంది, బాగా చేశావు, సినిమా చూడాలి” అని చెప్పారని అభి పంచుకున్నారు.
ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్లో తనే స్పెషల్..
తాను అవకాశాలను అడగడానికి మొహమాటం పడతానని అదిరే అభి చెప్పుకొచ్చారు. “అడగందే అమ్మైనా పెట్టదంటారు కదా అది మీకు గుర్తుంది కదా?” అని అడిగిన ప్రశ్నకు, “ఉంది ఉంది, స్టిల్ ట్రై, ఐ విల్ ట్రై టు చేంజ్” అని సమాధానమిచ్చారు. తన మొహమాటం కారణంగానే కొన్ని అవకాశాలు కోల్పోయానని పరోక్షంగా తెలియజేశారు. తన బలహీనతను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అనిల్ రావిపూడి సహాయం ఎందుకు తీసుకోలేదని అడిగినప్పుడు, అనిల్ టీమ్‌లో ఉన్న సాయి ద్వారా అనిల్‌ను కలిశానని, ఆ సందర్భంలోనే తన కష్టాలను పంచుకున్నానని తెలిపారు. అభి తన కెరీర్లో బాహుబలి చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవాన్ని కూడా పంచుకున్నారు. దీనికంటే ముందు కీరవాణి యూఎస్ లో నిర్వహించిన షోస్‌కు యాంకర్‌గా వ్యవహరించారు. ఆ సమయంలోనే వల్లి మేడమ్‌ను కలిసి బాహుబలిలో పనిచేయాలనే తన కోరికను తెలియజేశారు. మొదట ఒకసారి అడిగి వదిలేసినప్పటికీ, వల్లి మేడమ్ గుర్తుపెట్టుకొని, “నువ్వు జాయిన్ అవుతా అన్నావు కదా వచ్చేసేయ్” అని పిలవడంతో అభి బాహుబలి: ది కన్‌క్లూజన్ నిర్మాణంలో భాగమయ్యానని గుర్తు చేసుకున్నారు. దాదాపు ఒక సంవత్సరం పాటు రాజమౌళి బృందంతో కలిసి పనిచేశానని అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..
రాజమౌళి గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఒక సంవత్సరం కాలంలో పర్ఫెక్షన్, టైమింగ్, డిసిప్లిన్, ప్లానింగ్ వంటి అంశాలను నేర్చుకున్నానని అభి తెలిపారు. “ఒక షో ప్లాన్ చేసుకుంటే, ఒక షూట్ ప్లాన్ చేసుకుంటే, చెక్ లిస్ట్ రాసుకొని ఈ షాట్, ఈ షాట్, ఈ షాట్ అని రాసుకొని, అయిపోయిందని టిక్ చేసుకుంటూ చెక్ లిస్ట్… మామూలుగా చాలా మంది ఏంటంటే అక్కడికి వెళ్లిన తర్వాత చూసుకుందాంలే అనుకుంటారు. అలా కాకుండా ఆయన ఆ స్టేజ్ లో ఉండి కూడా చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఈరోజు చేయాల్సిన షాట్స్, ఒక కార్పొరేట్ కంపెనీలో డెలివరబుల్స్ ఎలా ఉంటాయో, నెక్స్ట్ షెడ్యూల్ లో థర్డ్ డే జరుగుతున్న షూట్ లో ఏం షాట్స్” అని వివరించారు.
ఎక్కువమంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్‌తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..
అదిరే అభి..
ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..