Headlines

‘కల్కి 2’లో దీపిక పదుకొనేకు రీప్లేస్ ఎవరు?

‘కల్కి 2’లో దీపిక పదుకొనేకు రీప్లేస్ ఎవరు?


కల్కి 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు నాగ్‌ అశ్విన్ తన పనిలో నిమగ్నమై ఉండగా, హీరో ప్రభాస్ కూడా తన ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అయితే, కల్కి 2లో దీపికా పదుకొనే స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయంపై ఇప్పటివరకు మేకర్స్ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఇది సినిమాపై ఉత్కంఠను పెంచుతోంది.ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ పూర్తయినట్లు నాగ్‌ అశ్విన్ తెలిపారు. కానీ హీరోయిన్ ఎంపిక విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దీపికా పదుకొనే స్థాయి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న నటి కోసం చిత్రబృందం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా వారణాసి షూటింగ్‌తో బిజీగా ఉండగా, కత్రినా కైఫ్, కృతి సనన్, శ్రద్ధా కపూర్ వంటి తారలు ఈ పాత్రకు అంతగా సూట్ అవ్వకపోవచ్చని చర్చలు నడుస్తున్నాయి. పాన్ ఇండియా అప్పీల్ కోసం బాలీవుడ్ నటి వైపు వెళ్తారా, లేక మృణాల్ ఠాకూర్ వంటి దక్షిణాది తారను ఎంచుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్‌కు జోడీగా అనుష్క శెట్టి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వీడియోల కోసం :

టాక్సిక్‌ క్రేజ్‌… ఫస్ట్ ఈవెంటే నెక్స్ట్ లెవల్‌!

ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే

పెళ్లిచూపులకు పదేళ్లు..తనని తాను స్టార్‌గా మలుచుకున్న రౌడీ భాయ్‌

లీస్ట్ బడ్జెట్‌.. రికార్డ్ టైమ్‌..సందీప్‌ స్కెచ్‌..ప్రభాస్‌కు సెట్ అవుతుందా?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *