Headlines

Chicken Prices: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఢమాల్.. నాన్ వెజ్ ప్రియులకు పండుగే.. కిలో ఎంతంటే..?


తెలుగు రాష్ట్రాల్లోని నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త. కొద్ది రోజుల క్రితం వరకు ఆకాశాన్నంటిన చికెన్ ధరలు.. ఇప్పుడు భారీగా పడిపోయాయి. గతంలో కిలో చికెన్ ధర రూ.330 నుంచి రూ.350 వరకు చేరుకోవడంతో సామాన్యులు చికెన్ కొనుగోలు చేయాలంటేనే వెనకడుగు వేసే పరిస్థితులు వచ్చాయి. అయితే శ్రావణ మాసం రాకతో చికెన్ ధరలు తగ్గుతూ వచ్చాయి. శ్రావణ మాసం పూర్తయిన ధరల్లో పెద్ద మార్పు ఏమీ కనిపించడం లేదు. శ్రావణ మాసం కారణంగానే ధరలు తగ్గాయని, కొన్ని రోజుల పాటు ఇలాగే కొనసాగుతాయని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. శ్రావణ మాసంలో చాలామంది హిందువులు మాంసానికి దూరంగా ఉంటారు. దీంతో మార్కెట్లో చికెన్‌కు డిమాండ్ భారీగా పడిపోయింది. కొనుగోళ్లు తగ్గడంతో సరఫరా ఉన్నప్పటికీ ధరలు దిగొస్తున్నాయి.

తగ్గిన చికెన్ ధరలు

గతంలో రూ.300 దాటిన చికెన్.. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో రూ.250 లోపే లభిస్తోంది. పౌల్ట్రీ మార్కెట్‌లో ధరలు డిమాండ్‌ను బట్టి మారుతుంటాయి. ప్రస్తుతం కొనుగోళ్లు తగ్గడంతో కోళ్ల ధరలపై ప్రభావం పడి.. ఫారాల వద్ద కూడా ధరలు తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన జోన్‌లలో చికెన్ ధరలను పరిశీలిస్తే.. ఆదివారం హైదరాబాద్ జోన్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.235గా ఉంది. డ్రెస్డ్ చికెన్ రూ.208 పలుకుతోండగా.. రిటైల్ లైవ్ బర్డ్ కిలో రూ.134, ఫారం వద్ద లైవ్ బర్డ్ ధర రూ.107గా ఉంది. గతంలో ఉన్న ధరలతో పోలిస్తే ధరలు రూ.100 మేర పడిపోయాయి. ఇక కరీంనగర్ జోన్‌ పరిధిలో డ్రెస్డ్ చికెన్ కిలో రూ.208, స్కిన్‌లెస్ చికెన్ రూ.235గా ఉంది. ఫారం వద్ద లైవ్ బర్డ్ రూ.107 ఉండగా.. రిటైల్ మార్కెట్‌లో రూ.134కు విక్రయిస్తున్నారు.

గ్రుడ్ల ధరలు ఇవే..

విజయవాడ జోన్‌లో చికెన్ ధరల్లో స్వల్ప తేడాలున్నాయి. విజయవాడలో స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.240 పలుకుతుండగా.. డ్రెస్డ్ చికెన్ రూ.212గా ఉంది. రిటైల్ లైవ్ బర్డ్ కిలో రూ.137గా ఉండగా.. ఫారం వద్ద లైవ్ బర్డ్ రూ.110గా ఉంది. హైదరాబాద్, కరీంనగర్‌తో పోలిస్తే విజయవాడలో చికెన్ ధరల్లో స్వల్ప తేడాలున్నాయి. ప్రాంతాన్ని బట్టి, చికెన్ రకం బట్టి ధరల్లో కొంత తేడా ఉంటాయి. ప్రస్తుతం తగ్గిన ఈ ధరలు ఎంతకాలం కొనసాగుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. రానున్న రోజుల్లో వినాయక చవితి, దసరా లాంటి పండుగలు వస్తుండటంతో.. చికెన్‌కు మళ్లీ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వారాంతాలు, పండుగలు, ఇతర ప్రత్యేక రోజుల్లో చికెన్ కొనుగోళ్లు అధికమవుతాయి. డిమాండ్ పెరిగితే ధరలు కూడా మళ్లీ పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. అటు కోడిగుడ్ల ధరలు మాత్రం పెరుగుతున్నాయి. విజయవాడ జోన్‌లో 12 గ్రుడ్ల రిటైల్ ధర రూ.80గా ఉండగా.. హైదరాబాద్ జోన్‌లో రూ.76 వద్ద కొనసాగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *