ఇండస్ట్రీతో పనిలేదు.. స్టార్ హీరోల ఇమేజ్‌తో అవసరం లేదు.. వందల కోట్ల బడ్జెట్ అనే పట్టింపే లేదు.. కంటెంట్ నచ్చలేదా రెండో రోజే సీన్ రివర్స్ అయిపోతుంది. అది కూడా ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలకు ఎక్కువగా జరుగుతుంది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా అన్నిచోట్లా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. మరి ఈ మధ్య అలా షాకులు తిన్న హీరోలెవరో చూద్దామా..? ప్రతీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలకు షాకిస్తున్నాయి డిజాస్టర్స్. కనీసం ఒకట్రెండు రోజులు కూడా థియేటర్లలో ఉండట్లేదు.. టాక్సిక్ చేసిన గాయం యశ్‌ను చాన్నాళ్లే వెంటాడేలా ఉంది. మరో సినిమా చేసి హిట్ కొట్టేవరకు టాక్సిక్ దెబ్బ పచ్చిగానే ఉంటుంది. దాదాపు 300 కోట్ల నష్టాలతో ఇండియాస్ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది టాక్సిక్. యశ్ ఆశలన్నీ ఇప్పుడు రామాయణపైనే ఉన్నాయి. కన్నడలో యశ్‌కు టాక్సిక్ ఎంతటి గాయం చేసిందో.. తమిళంలో కార్తికి సర్దార్ 2 కూడా అంతే గాయం చేసింది. భారీ అంచనాల మధ్య ఈ సీక్వెల్ కనీసం మూడ్రోజులు కూడా ఆడలేదు. పిఎస్ మిత్రన్ తెరకెక్కించిన సర్దార్ 2ని ఔట్ రేటెడ్‌గా తిప్పికొట్టారు ఆడియన్స్. గత రెండు మూడేళ్లలో సత్యం సుందరం మినహాయిస్తే కార్తికి చెప్పుకోదగ్గ సినిమానే లేదు. విశాల్‌కు మకుటం కూడా ఇలాంటి చేదు అనుభవమే మిగిల్చింది. పైగా ఆ సినిమాకు దర్శకుడు కూడా ఈయనే. పెట్టిన బడ్జెట్లో కనీసం పదోవంతు కూడా వసూలు చేయలేదు ఈ చిత్రం. అక్షయ్ కుమార్ హైవాన్ సినిమాను 130 కోట్లతో KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తే కనీసం 13 కోట్లు రాలేదు. ఇలా అన్ని ఇండస్ట్రీల్లోనూ స్టార్ హీరోలను ఎపిక్ డిజాస్టర్స్ వెంటాడుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Abhishek Sharma: 30 బంతుల్లో సెంచరీ …అభిషేక్ శర్మ వరల్డ్ రికార్డ్
ర్యాపిడో, ఓలా , ఊబర్‌కు కేంద్రం కీలక ఆదేశాలు!
దేశవ్యాప్తంగా పనీర్ బ్యాన్! 5 వేల లైసెన్సులు రద్దు!
UPI కొత్త నిబంధనలు.. సామాన్యులపై ప్రభావం ఎంత?
Nirmala Seetharaman: ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాట పాడుతూ.. కంటతడి పెట్టుకున్న నిర్మలా సీతారామన్