Headlines

మన జీవితాన్ని తీర్చిదిద్దిన గురువులకు.. టీచర్స్ డే శుభాకాంక్షలు ఇలా చెప్పండి!

మనకి చదువు అంటే ఏంటో తెలియని రోజు నుంచి మనకి చదువు గురించి మొత్తం అర్ధమయ్యే వరకు మన చెయ్యి పట్టుకుని ఉండేది ఒకే ఒక్కరు ఆయనే గురువు. మన జ్ఞానాన్ని పంచుతూ, మనల్ని మంచి మనిషిగా మార్చి ఎదగడానికి మార్గం చూపించే గురువులందరికీ హృదయపూర్వక నమస్కారం టీచర్స్ డే శుభాకాంక్షలు! కేవలం చదువు మాత్రమే చెప్పేసి చేతులు దులుపుకోకుండా జీవితంలో ఎలా అడుగులు వెయ్యాలి? కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఎలా గెలవాలో నేర్పిన ప్రతి…

Read Full News

Viral Video: హృదయాలను హత్తుకునే వీడియో.. చూస్తే కన్నీళ్లు ఆగవు!

మధ్యతరగతి అబ్బాయిల జీవితం బయటకు కనిపించేంత సులభం కాదు. ఎంత కష్టం వచ్చినా పక్కవారికి చెప్పుకోలేరు, కుటుంబ బాధ్యతల నడుమ ఎంతటి కష్టం వచ్చినా ఎవరికీ చూపించకుండా భరిస్తూ ముందుకు సాగాల్సిందే. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవున్న ఓ వీడియో సైతం అచ్చం అలాంటి పరిస్థితినే కళ్లకు కట్టినట్టు చూపింది. కుటుంబాన్ని పోషించేందుకు కూలీ పనుల కోసం ఊరుకాని ఊరు వచ్చి కష్టపడుతున్న ఓ కుర్రాడు.. దొంగతనంగా తన ఆకలిని తీర్చుకుంటున్న దృశ్యం నెటిజన్లను కంటతడి పెట్టకుండా…

Read Full News

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కృష్ణ దేవాలయం ఇదే.. మేఘాల మధ్య కొలువైన కన్నయ్య!

Yulla Kanda Krishna Temple Telugu: హిమాలయ పర్వతాల ఒడిలో, మేఘాలను తాకేంత ఎత్తులో శ్రీకృష్ణుడు కొలువై ఉన్న అరుదైన పుణ్యక్షేత్రం ఒకటి ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీకృష్ణ దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలోని యుల్లా కంద ప్రాంతంలో ఉంది. సముద్ర మట్టానికి సుమారు 12,778 అడుగుల (3,895 మీటర్లు) ఎత్తులో ఉన్న ఈ ఆలయం ప్రకృతి అందాల మధ్య భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. హిమాలయాల్లోని రోరా లోయ…

Read Full News

Ravi Teja: రూటు మార్చిన రవితేజ.. మొదటిసారి అలాంటి స్టోరీతో రానున్న మాస్ రాజా

మాస్ మహారాజ రవితేజ రీసెంట్ గా ఇరుముడి సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేశారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది అలాగే కలెక్షన్స్ పరంగానూ ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతుంది. చాలా కాలం తర్వాత రవితేజ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో రవితేజ తన నటనతో కట్టిపడేసాడు. ఇరుముడి సినిమా తాజాగా రూ. 200కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. దాంతో రవితేజ ఫ్యాన్స్…

Read Full News

Sugar Restriction: పిల్లలను రెండేళ్ల వరకు చక్కెరకు దూరంగా ఉంచితే.. భవిష్యత్తులో ఇంత పెద్ద ప్రయోజనమా?

బ్రిటన్‌లో 1953లో అమలైన చక్కెర నియంత్రణకు సంబంధించిన చారిత్రక పరిస్థితులను పరిశీలిస్తూ ఈ పరిశోధన జరిగింది. 64,000 మందికి పైగా వ్యక్తుల డేటాను విశ్లేషించిన పరిశోధకులు, చిన్నతనంలో తక్కువ చక్కెర అందుబాటులో ఉన్నవారిలో తరువాతి జీవితంలో కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం తక్కువగా కనిపించిందని గుర్తించారు. అయితే ఈ ఫలితాలను చక్కెర పూర్తిగా మానేస్తే క్యాన్సర్ రాదు అనే అర్థంలో తీసుకోకూడదు. అధ్యయనం సూచించిన సంబంధాలను మరింత పరిశోధనతో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 1. 1953…

Read Full News

Healthy Sleep: 8 గంటల నిద్ర తర్వాత కూడా అలసటగా ఉందా? కారణం ఇదే కావచ్చు!

దీని అర్థం ప్రతి ఒక్కరూ కచ్చితంగా 7 గంటలే నిద్రపోవాలని కాదు. వయసు, జన్యుపరమైన అంశాలు, జీవనశైలి, ఆరోగ్య పరిస్థితులు వంటి వాటిని బట్టి వ్యక్తి నిద్ర అవసరం మారుతుంది. ఎక్కువసేపు నిద్రపోవడం కొన్ని సందర్భాల్లో ఆరోగ్య సమస్యకు కారణం కాకుండా, ఇప్పటికే ఉన్న సమస్యకు ఒక లక్షణంగా కూడా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. 1. రోజూ ఎంతసేపు నిద్రపోవడం మంచిది? అధ్యయనంలో సుమారు 6.4 నుంచి 7.8 గంటల రాత్రి నిద్ర ఉన్నవారిలో ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి…

Read Full News

చంద్ర మంగళ యోగం.. వారి కోరికలు నెరవేరడం పక్కా..! డబ్బుకు ఢోకా ఉండదు..

గ్రహచారంలో చంద్ర, కుజులు కలిసి ఉన్న మూడు రోజుల కాలంలో ఎటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా, ఎటువంటి కలలు కన్నా అవి తప్పకుండా సాకారం అవుతాయి. చంద్ర మంగళ యోగం అనుకూలంగా ఉంటే చాలు, ఆ రాశులవారికి దారిద్ర్యం అంటదని, ఆర్థిక సమస్యలు దగ్గరికి రావని, ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. చంద్ర, కుజులు ఒకరికొకరు కేంద్రాల్లో అంటే 1, 4, 7, 10 స్థానాల్లో ఉన్నప్పుడు ఈ యోగం పడుతుంది. ఈ…

Read Full News

వచ్చేస్తున్నాయ్.. ఫైవ్ స్టార్ హోటల్‌ను మించి.. 260 వందే భారత్ స్లీపర్ రైళ్లతో లగ్జరీ నైట్ జర్నీ..

ఇప్పటికే గౌహతి-హౌరా మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ సర్వీసులు పట్టాలెక్కగా.. మరికొన్ని రైళ్లు ప్రస్తుతం ట్రయల్ రన్ పూర్తి చేసుకుంటున్నాయి. వీటిని త్వరలోనే బెంగళూరు-ముంబై వంటి కీలక మార్గాల్లో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ రూట్లలో రాత్రి ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు రైల్వే శాఖ భారీ స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఈ స్లీపర్ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు భారతీయ రైల్వే ఏకంగా 260 రైళ్లను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా…

Read Full News

Kitchen Chimney Cleaning: ఎన్నిరోజులకు ఒకసారి శుభ్రం చేయాలి? నిర్లక్ష్యం చేస్తే ఈ సమస్యలు తప్పవు!

అయితే ప్రతి ఇంట్లో చిమ్నీని ఒకే వ్యవధిలో శుభ్రం చేయాలనే నియమం ఉండదు. రోజూ ఎంతసేపు వంట చేస్తున్నారు, తరచుగా డీప్ ఫ్రై లేదా నూనెతో కూడిన వంటకాలు చేస్తున్నారా, చిమ్నీలో ఏ రకమైన ఫిల్టర్ ఉంది వంటి అంశాలపై శుభ్రపరిచే అవసరం ఆధారపడి ఉంటుంది. అందుకే మీ చిమ్నీ పరిస్థితిని గమనించడంతో పాటు, ఆ మోడల్‌కు సంబంధించిన యూజర్ మాన్యువల్‌లో తయారీదారు ఇచ్చిన సూచనలను కూడా పాటించడం ముఖ్యం. 1. రోజూ వంట చేస్తే మరింత…

Read Full News

8వ తరగతి విద్యార్ధులకు రూ.48 వేల స్కాలర్‌షిప్‌.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్

తెలంగాణ రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహక పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు సమీపించింది. తెలంగాణ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ నిర్వహించే ఈ పరీక్షకు సెప్టెంబరు 5, 2026వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు కింద జనరల్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.100 పరీక్ష ఫీజుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు రూ.50 ఫీజు చెల్లించాలి. ఫీజును…

Read Full News