Headlines

Shiva Nirvana: అప్పుడు నడుము గిల్లె సీన్ చేయనంది.. తర్వాత బేబీ చూసి షాకయ్యా.. వైష్ణవి గురించి ఇరుముడి డైరెక్టర్ కామెంట్స్..

బేబీ కాంబో మరోసారి రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న సినిమా ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్. ఈమూవీపై మొదటి నుంచి మంచి ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ తమ ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. తొలుత ఆయన…

Read Full News

ఆ ఏడాది ఏకంగా 16 చిత్రాలు.. శోభన్ బాబుకు ఉన్న బిరుదు ఏంటో తెలుసా..?

ఎన్టీఆర్‌కి ఉన్న బిరుదు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, ఏఎన్నార్‌కి నట సామ్రాట్, కృష్ణకు నటశేఖర.. మరి శోభన్ బాబుకు ఉన్న బిరుదు ఏంటో తెలుసా..? నటభూషణ. అవును సినిమా టైటిల్స్‌లో, వార్త పత్రికల్లో ఆయన్ను నటభూషణ అని సంభోదించేవారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అత్యంత అద్భుతమైన కెరీర్‌ సాగించారు శోభన్ బాబు.  అయితే నటభూషణ శోభన్ బాబు కెరీర్‌లో 1971వ సంవత్సరం అత్యంత కీలకమైనది. ఆ ఏడాది ఆయన ఏకంగా 16 చిత్రాల్లో నటించారు, వాటిలో అనేకం…

Read Full News

Telangana: ముళ్ల పొదల్లోంచి వింత శబ్దాలు.. దగ్గరకెళ్లి చూడగా గుండె పగిలే సీన్.. వీడియో చూడండి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో మనసున్న ప్రతి ఒక్కరినీ కలచివేసే దారుణ ఘటన వెలుగుచూసింది. పేగుబంధాన్ని తెంచుకుని, కనికరం లేకుండా ముళ్లపొదల్లో వదిలేసిన ఓ నవజాత శిశువును స్థానికులు సమయస్ఫూర్తితో కాపాడారు. పట్వారిగూడెం ఎస్సీ కాలనీ పరిసరాల్లో ఈ హృదయవిదారక ఉదంతం చోటుచేసుకుంది. అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఆర్ఎంపీ వైద్యుడి క్లినిక్ సమీపంలోని దట్టమైన ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన శిశువును వదిలి వెళ్లారు. చీకట్లో పసికందు ఒంటరిగా విలవిల్లాడిపోయింది. ఉదయం వేళ అటుగా…

Read Full News

ఆ ఆటగాడి కోసమే నా భార్య క్రికెట్ చూస్తోంది.. మాజీ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు..!

Vaibhav Sooryavanshi: భారత మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. దులీప్ ట్రోఫీలో ఈ యువ బ్యాటర్ ప్రదర్శన తనను ఆకట్టుకుందని శ్రీకాంత్ పేర్కొన్నాడు. వైభవ్‌ను సరైన విధంగా తీర్చిదిద్దితే భవిష్యత్తులో అతడు సూపర్‌స్టార్‌గా ఎదుగుతాడని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు, వైభవ్ ఆటను చూసేందుకు తన భార్య కూడా దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు చూస్తోందని తన యూట్యూబ్ ఛానల్‌లో వెల్లడించాడు. ఎర్ర బంతి క్రికెట్‌లోనూ మీడియం పేసర్లను ధాటిగా ఎదుర్కొంటూ సిక్సర్లు…

Read Full News

ఆహా.. వల వేసిన జాలరి పంట పండింది.. ఎంత రేటు పలికింది అంటే..?

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు అరుదైన భారీ పండుగప్ప చేప చిక్కింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపల్లిపాలెం సముద్ర తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు సుమారు 25 కిలోల బరువున్న పండుగప్ప దొరికింది. భారీ ఆకారంలో ఉన్న ఈ చేపను ఒడ్డుకు తీసుకొచ్చిన వెంటనే స్థానికుల్లో ఆసక్తి మొదలైంది. చేపను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు. సాధారణంగా పండుగప్పకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. అలాంటిది ఏకంగా 25 కిలోల బరువున్న…

Read Full News

టీచర్స్ డే.. చదువు చెప్పిన గురువుకు ఓ చిన్న థ్యాంక్స్.. వారికీ ఇలా చేస్తే మరచిపోలేరు!

మనకి చదువు అంటే ఏంటో తెలియని రోజు నుంచి మనకి చదువు గురించి మొత్తం అర్ధమయ్యే వరకు మన చెయ్యి పట్టుకుని ఉండేది ఒకే ఒక్కరు ఆయనే గురువు. మన జ్ఞానాన్ని పంచుతూ, మనల్ని మంచి మనిషిగా మార్చి ఎదగడానికి మార్గం చూపించే గురువులందరికీ హృదయపూర్వక నమస్కారం టీచర్స్ డే శుభాకాంక్షలు! సాధారణ గిఫ్ట్ కంటే మీ చేతితో రాసిన జ్ఞాపకాల పుస్తకం చాలా బెటర్. మీకు ఇష్టమైన తరగతి గది జ్ఞాపకం, విలువైన పాఠం, ఏమైనా…

Read Full News

Happy Teachers’ Day 2026: టాలీవుడ్‌లో ఉపాధ్యాయ పాత్రలతో మెప్పించిన గుర్తుండిపోయే సినిమాలు.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు..

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. దేశవ్యాప్తంగా విద్యార్థుల కెరీర్‌లను, జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు అందించే అవిశ్రాంత కృషిని, మార్గదర్శకత్వాన్ని గౌరవిస్తూ భారతదేశంలో ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు.విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు చేసే కృషిని గౌరవించడానికి ఈ రోజు ప్రత్యేకం. తెలుగు సినిమాలో కూడా గురువుల ప్రాధాన్యతను, వారు సమాజంపై చూపే ప్రభావాన్ని ఎన్నో చిత్రాలు అద్భుతంగా ఆవిష్కరించాయి. అయితే వెండితెరపై ఇప్పటికే ఎన్నో చిత్రాలు ఉపాధ్యాయుల కృష్ణిని…

Read Full News

I’m Game Collections : దుల్కర్ ఈజ్ బ్యాక్.. ఐ యామ్ గేమ్ సినిమాతో బాక్సాఫీస్ షేక్.. టాక్సిక్ ఫస్డ్ డే కలెక్షన్లను మించిపోయి..

మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన సొంత గడ్డపై సత్తా చాటాడు. దాదాపు మూడేళ్ల తర్వాత ఐ యామ్ గేమ్ సినిమాతో మలయళీ అడియన్స్ ముందుకు వచ్చాడు ఈ హీరో. 2023లో వచ్చిన కింగ్ ఆఫ్ కొత్త తర్వాత దుల్కర్ నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 3 ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించగా.. రెండు రోజుల్లో రికార్డ్ బ్రేక్ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా వసూళ్లు చార్టులలో అగ్రస్థానంలో లేనప్పటికీ,…

Read Full News

Ambani Home: ముఖేష్ అంబానీ ఇల్లు ఇప్పుడు అమ్మితే ఎంత ధర ఉంటుంది? తెలిస్తే షాకవుతారు!

Antilia House Price: ముఖేష్‌ అంబానీ.. ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అంబానీ అంటే అందరికి తెలిసిందే. ఆసియాలోని ధనవంతుల్లో ముఖేష్ అంబానీ ఒకరు. అంబానీ ఫ్యామిలీ ఆల్టామౌంట్ రోడ్‌లో ఉన్న యాంటిలియా భవనంలో నివసిస్తోంది. ఈ యాంటిలియా భవనాన్ని 2010లో నిర్మాణం చేపట్టారు. అప్పట్లో దీనిని నిర్మించడానికి అక్షరాల సుమారు రూ.15,000 కోట్లకుపైనే ఖర్చు అయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ యాంటిలియా భవనం నిర్మించడానికి సుమారు నాలుగు సంవత్సరాలు పట్టింది. ఈ బిల్డింగ్‌ నిర్మాణం…

Read Full News

Janmashtami: 9 ఏళ్ల వయసులోనే క్లాసికల్ డ్యాన్స్‏తో అద్భుతం.. ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. ఫాలోయింగ్ మాములుగా ఉండదు..

దేశవ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సామాన్యులు, సెలబ్రెటీస్ తమ ఇళ్లల్లో ఎంతో ఘనంగా కృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియా షేర్ చేయగా క్షణాల్లో వైరల్ అయ్యాయి. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో కృష్ణాష్టమి సందర్భంగా తనకు తొమ్మిదేళ్ల వయసులో చేసిన భారతనాట్యం వీడియోను పంచుకుంది. అందులో తన నృత్యం, హావభావలను అద్భుతంగా ప్రదర్శిస్తూ…

Read Full News