APRS CAT 2026: గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు ఏపీఆర్‌ఎస్ క్యాట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు లింక్ ఇదిగో!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాలకు ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఏపీఆర్‌ఎస్ క్యాట్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బాలురు, బాలికలకు గురుకుల పాఠశాలల్లో సీట్లు కేటాయిస్తారు. ఐదో తరగతితోపాటు 6వ, 7వ, 8వ తరగతుల్లో మిగిలిపోయిన సీట్లను కూడా భర్తీ చేస్తారు. అర్హులైన ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అనాథ, వికలాంగ…