El Nino: రైతన్నలకు శాపంగా మారిన ఎల్‌నీనో.. వర్షాలు లేక నల్గొండలో నెర్రెలు వారిన నేలలు..
సాధారణంగా వానకాలం సీజన్‌లో ఈ సమయానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా పచ్చని పైర్లతో కళకళలాడాలి. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటికే నాట్లు వేసిన వరి పొలాల్లో నీటి కొరత మొదలైంది. నిన్నటి వరకు పచ్చగా కనిపించిన మడి, ఇవాళ తడారిపోయి కనిపిస్తోంది. ఒక్కో మడి చొప్పున ఎండిపోతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. సాగు విస్తీర్ణం తగ్గినా.. పెరిగిన అన్నదాతల కష్టాలు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వాన కాలంలో19.41 లక్షల ఎకరాల…