
Madhya Pradesh: ఇండోర్‌లో పెను ప్రమాదం.. 3 అంతస్తుల భవనం కూలి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇండోర్ లో మూడంతస్తుల భవనం అకస్మాత్తుగా కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో భవనం లోపల చాలా మంది ఉన్నారు. ఇద్దరు మరణించగా.. మరో 12 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన 14 మంది శిథిలాల కింద చిక్కుకున్నారని జిల్లా కలెక్టర్ శివం వర్మ తెలిపారు. క్షతగాత్రుల్లో 12 మంది మహారాజా యశ్వంతరావు ప్రభుత్వ ఆసుపత్రి (MYH)లో చికిత్స పొందుతున్నారు. మృతులను అలీఫా, ఫహీమ్‌గా గుర్తించారు….