Cash Deposit: మీరు బ్యాంక్ నుంచి తీసిన నగదు మళ్లీ అకౌంట్లో జమ చేస్తున్నారా? కోర్టు కీలక తీర్పు!

Cash Deposit: మీరు బ్యాంక్ నుంచి తీసిన నగదు మళ్లీ అకౌంట్లో జమ చేస్తున్నారా? కోర్టు కీలక తీర్పు!


చాలామంది అత్యవసరాల కోసం బ్యాంకు ఖాతా నుండి పెద్ద మొత్తంలో నగదు ఉపసంహరించుకుని ఇంట్లో ఉంచుకుంటారు. అవసరం తీరిన తర్వాత లేదా ఆ డబ్బు వాడనప్పుడు తిరిగి బ్యాంకులో జమ చేస్తారు. అయితే, ఇలా జమ చేసినప్పుడు ఆదాయపు పన్ను శాఖ (Income Tax) నుండి నోటీసులు వస్తే పరిస్థితి ఏంటి? తాజాగా ‘ఆదాయపు పన్ను అప్పీళ్ల ట్రిబ్యునల్’ (ITAT) ఇచ్చిన తీర్పు పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరటనిచ్చింది.

అసలేం జరిగింది?

ఒక మహిళ 2016 నోట్ల రద్దు సమయంలో తన ఖాతాలో రూ.15 లక్షల నగదును జమ చేశారు. దీనిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ నోటీసులు ఇచ్చారు. ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో చూపాలని కోరారు. దానికి సదరు మహిళ.. తాను గతంలో వివిధ సందర్భాల్లో బ్యాంకు నుంచి విత్‌డ్రా చేసిన డబ్బే అది అని, అవసరం లేక తిరిగి జమ చేశానని ఆధారాలతో సహా వివరించారు. కానీ అధికారులు, “అంత పెద్ద మొత్తాన్ని ఎవరూ ఇంట్లో ఊరికే ఉంచుకోరు. అది వేరే మార్గాల్లో వచ్చిన ఆదాయం కావచ్చు” అని వాదిస్తూ ఆమెపై పన్ను విధించారు.

ట్రిబ్యునల్ ఇచ్చిన కీలక తీర్పు:

ఈ వివాదం ఐటీఏటీ (ITAT) ముందుకు వెళ్లగా, మహిళకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ట్రిబ్యునల్ ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావించింది.

ఇవి కూడా చదవండి

ఆధారాలు ముఖ్యం: నగదు ఉపసంహరణకు సంబంధించిన బ్యాంక్ స్టేట్‌మెంట్లు స్పష్టంగా ఉన్నప్పుడు, ఆ డబ్బు ఖర్చయిపోయిందని నిరూపించడానికి అధికారుల వద్ద బలమైన ఆధారాలు ఉండాలి. కేవలం అనుమానంతో లేదా అసాధారణంగా ఉందనే కారణంతో ఒక వ్యక్తి ఆదాయంపై పన్ను వేయలేరు. పన్ను చెల్లింపుదారుడు తన వద్ద ఉన్న ఆధారాలను చూపిన తర్వాత, అది తప్పు అని నిరూపించాల్సిన బాధ్యత ఐటీ శాఖపైనే ఉంటుంది.

నగదు దాచుకునే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

మీరు కూడా బ్యాంకు నుండి డబ్బు తీసి ఇంట్లో ఉంచుకుని, మళ్లీ జమ చేయాలనుకుంటే ఈ క్రింది జాగ్రత్తలు తప్పనిసరి:

రికార్డులు భద్రం: నగదు విత్‌డ్రా చేసినప్పటి బ్యాంక్ స్టేట్‌మెంట్లను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఏ అవసరం కోసం డబ్బు తీశారు? ఎందుకు మళ్లీ జమ చేస్తున్నారు? అనే దానికి సరైన వివరణ ఉండాలి. లక్షల్లో లావాదేవీలు చేసేటప్పుడు పన్ను నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. బ్యాంకు నుంచి తీసిన డబ్బును తిరిగి జమ చేయడం నేరం కాదు. కానీ, ఆ డబ్బుకు సంబంధించిన మూలాలు (Sources), పత్రాలు సరిగ్గా ఉంటే ఐటీ నోటీసులు వచ్చినా భయపడాల్సిన పని లేదని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది.

ఇది కూడా చదవండి: Gold Price Today: కుప్పకూలుతున్న బంగారం, వెండి.. భారీగా తగ్గిన ధరలు.. ఎంత తగ్గిందంటే..

ఇది కూడా చదవండి: Will Rules: మీ ఆస్తి విషయంలో పిల్లల మధ్య గొడవలు రాకూడదా? ఇలా చేయండి.. ఇది ఎందుకంత ముఖ్యం?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *