Hanuman Movie: ‘హనుమాన్’ సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా? పాపం ఇప్పటికీ బాధపడుతోంది

Hanuman Movie: ‘హనుమాన్’ సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా? పాపం ఇప్పటికీ బాధపడుతోంది


‘కొన్ని సినిమాలు కొందరికే రాసి పెట్టి ఉంటాయి’ అన్నట్లు సినిమా ఇండస్ట్రీలో కథలు చేతులు మారడమనేది సహజం. ఒక హీరో/ హీరోయిన్ చేయాల్సిన సినిమా ఇంకో హీరో, హీరోయిన్ దగ్గరకు వెళ్లడం ఇక్కడ పరిపాటి. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. 2024 సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ డివోషనల్ థ్రిల్లర్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాలో తేజ సజ్జా హీరోయిన్ గా నటించాడు. అమృతా అయ్యర్ కథానాయిక. వరలక్ష్మీ శరత్ కుమార్ హీరో సోదరి పాత్రలో నటిస్తే వినయ్ రాయ్ క్రూరమైన విలన్ పాత్రలో భయపెట్టాడు. ఈ సినిమాలో తేజ సజ్జా నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే హీరోయిన్ రోల్ కు కూడా మంచి ప్రాధాన్యముంది. అందులో అమృతా అయ్యర్ చక్కగా నటించింది. అందం, అమాయకత్వం కూడిన నటనతో ఆడియెన్స్ ను కట్టిపడేసింది. అయితే హనుమాన్ సినిమాలో హీరోయిన్ గా అమృతా అయ్యర్ ఫస్ట్ ఛాయిస్ కాదట. మొదట ఈ ఛాన్స్ హైదరాబాద్ బ్యూటీ, చిట్టీ అలియాస్ ఫరియా అబ్ధుల్లాకు వచ్చిందట. అయితే కొన్ని కారణాలతో ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట. ఈ విషయాన్ని ఆమెనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.

ఫరియా అబ్దుల్లా నటించిన లేటెస్ట్ సినిమా గాయపడ్డ సింహం. తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఈ సినిమా ప్రమోషన్లలో మాట్లాడిన ఫరియా హనుమాన్ సినిమా హీరోయిన్ ఛాన్స్ ఎలా మిస్ అయ్యిందో చెప్పుకొచ్చింది. ‘నేను తేజ సజ్జా హీరోగా చేసిన ‘హనుమాన్’ సినిమా చేయలేకపోయాను. అప్పుడు నాకు బ్రెయిన్ లేదు. బుద్ధి లేక నో చెప్పాను. నిజంగానే ఆ సమయంలో నాకు కథని ఎలా జడ్జ్ చేయాలో తెలియలేదు. నేను కొత్తగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. ‘జాతి రత్నాలు’ పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత సరైన స్క్రిప్ట్స్ ఎంచుకోవాలనే ఆలోచనలో కన్ఫ్యూజన్ లో పడిపోయాను. అందుకే ‘హనుమాన్’ స్క్రిప్ట్ ని సరిగా అంచనా వేయలేకపోయాను. ఇప్పటికీ ఎక్కడైనా తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మని కలిసినప్పుడు అది గుర్తొస్తుంది. మంచి సినిమా మిస్ అయ్యానని వాళ్లతో కూడా చెబుతుంటాను’ అని ఫరియా బాధపడుతోంది. ప్రస్తుతం ఈ నటి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

గాయపడ్డ సింహం సినిమా ప్రమోషన్లలో ఫరియా అబ్దుల్లా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *