బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ గా ఆరంభమయింది. ఆదివారం (సెప్టెంబర్ 6) సాయంత్రం నుంచి గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరుగుతోంది. హోస్ట్ కింగ్ నాగార్జున కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిని బిగ్ బాస్ హౌస్ లోకి ఆహ్వానిస్తున్నాడు. అలాగే వాళ్ల ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తదితర విషయాల గురించి పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా ప్రముఖ సీరియల్ నటి దేబ్జానీ మోదక్ ఎంట్రీ ఇచ్చింది. ఇక రెండవ కంటెస్టెంట్ గా హీరో త్రిగుణ్ ఎంట్రీ ఇచ్చాడు. మూడవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన ఝాన్సీ రాగా, నాలుగో కంటెస్టెంట్ గా సుధీర్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. రాయలసీమ ప్రాంతానికి చెందిన సుధీర్ రెడ్డి సింగపూర్ కి చదువుకోడానికి వెళ్లాడు. అయితే అక్కడ కొందరి చేతిలో మోసపోయాడు. అదే సమయంలో అక్కడ పరిచయం అయినా ఓ వ్యక్తి ద్వారా హోస్ట్ గా మారాడు. మారి ఇంటర్వ్యూలు చేస్తూ ఫేమ్ తెచ్చుకున్నాడు. అలాగే ఫిజిక్ కోచ్ గా కూడా పనిచేస్తున్నాడు. బోల్డ్ ఇంటర్వ్యూల ద్వారా బాగా ఫేమ్ తెచ్చుకున్నాడు సుధీర్. ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన సుధీర్ తన జీవిత ప్రయాణం గురించి ఇలా చెప్పుకొచ్చాడు.
బిగ్ బాస్ నాలుగో కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి..
BIGG BOSS House lo sarikottha avatharamtho sandhadi cheyadaniki #Sudheer siddamga unnadu🔥
Mari meeru siddama?👁️Watch the Grand Launch of #BiggBossSeason10, Playing Now only on #StarMaa#BiggBossTelugu10 #BiggBossTelugu10GrandLaunch pic.twitter.com/YiBuSzyxcN
— Starmaa (@StarMaa) September 6, 2026