Headlines

Bigg Boss Telugu 10: ఒకప్పుడు మెడికల్ షాప్‌లో వర్కర్‌.. బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్ స్టార్ కమెడియన్ గ్రాండ్ ఎంట్రీ


బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో అట్టహాసంగా ప్రారంభమైంది. గ్రాండ్ లాంఛ్ ఎపిసోడ్ లో భాగంగా ఎప్పటిలాగే హోస్ట్ కింగ్ నాగార్జున అద్దిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. అలాగే హీరో కార్తీ, మరో ప్రముఖ నటుడు ఎస్ జే సూర్య కూడా ఈ లాంఛింగ్ ఎపిసోడ్ లో సందడి చేశారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ లో మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి దేబ్ జానీ మోదక్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రెండో కంటెస్టెంట్ గా జబర్దస్త్ స్టార్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.

ఆటో రామ్ ప్రసాద్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఇతను కనీసం ఇంటర్మీడియెట్ కూడా పూర్తి చేయలేదు. కుటుంబ పోషణ కోసం వైజాగ్ లో ఓ మెడికల్ షాపులో పని చేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు దాదాపు ఆరేళ్ల పాటు మెడికల్ షాపులోనే పని చేస్తూ కుటుంబాన్ని పోషించాడు. ఇదే క్రమంలో నటనపై ఆసక్తి ఉండడంతో తన స్నేహితుడి సాయంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదట జబర్దస్త్ లో ఓ సాధారణ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు. కేవలం యాక్టింగ్ తోనే కాకుండా తన రైటింగ్ స్కిల్స్ తోనూ సత్తా చాటాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అందుకే జబర్దస్త్ లో టీమ్ లీడర్ దాకా ఎదిగాడు. అలాగే అవకాశమొచ్చినప్పుడల్లా సినిమాల్లోనూ నటిస్తున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోనూ అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. మరి జబర్దస్త్ తో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ఆటో రామ్ ప్రసాద్ బిగ్ బాస్ రియాలిటీ షోలో ఏ మేర ఆకట్టుకుంటాడో చూడాలి.

జబర్దస్త్ లో సూపర్ హిట్.. మరి బిగ్ బాస్ లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *