ప్రముఖ నటుడు కృష్ణుడు బిగ్ బాస్ తెలుగు 10 హౌజ్‌లోకి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. భారీ ఆశలు, అంచనాలతో హౌస్ లోకి వెళ్లిన ఆయన కేవలం రెండు వారాల్లోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. ఫిజికల్ టాస్కుల్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయకపోవడం, సరైన కంటెంట్ ఇవ్వకపోవడం, ఆడియెన్స్ కు సరైన ఎంటర్ టైన్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో కృష్ణుడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆయన వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తన బిగ్ బాస్ ప్రయాణం, కెరీర్ ప్లాన్స్ తదితర విషయాలపై తన ఆలోచనలను పంచుకుంటున్నారు. ఇదే క్రమంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 టాప్ కంటెస్టెంట్స్, విన్నర్ తదితర విషయాలపై కూడా కృష్ణుడు మాట్లాడారు. ‘బిగ్ బాస్‌లో నాలోని మరో యాంగిల్‌ని చూపించాలనుకున్నాను. ఫన్ యాంగిల్, ఫ్యామిలీ యాంగిల్ కూడా చూపించాలనుకున్నాను, కానీ అనుకోకుండా ఎలిమినేట్ అయ్యాను. అయితే ఎలిమినేట్ కావడం పట్ల నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. నా తప్పిదం వల్లే ఎలిమినేట్ అయ్యాను. ఫుడ్ విషయంలో, స్వీట్స్ విషయంలో ఇబ్బంది పడ్డాను. దీని కారణంగా విపరీతమైన తలనొప్పి వచ్చింది. ఆటపై సరిగా ఫోకస్ పెట్టలేకపోయాను. ఇక లైట్స్ ఉంటే నాకు నిద్ర రాదు. కానీ హౌజ్‌లో లైట్స్ ఉండటంతో అసలు నిద్రపోలేదు. దీంతో తలనొప్పి మరింత ఎక్కువైంది. దీన్నే అలుసుగా తీసుకొని కొందరు నన్ను ట్రోల్ చేశారు. ముఖ్యంగా హౌజ్‌లో ఉన్న ఒక కంటెస్టెంట్ నన్ను టార్గెట్ చేశారు. తన పీఆర్ టీమ్‌తోనే నాపై ట్రోల్స్ చేయించి, నన్ను బ్యాడ్ చేసే ప్రయత్నం చేశాడు’ అని కృష్ణుడు ఆరోపించారు. అయితే ఆ కంటెస్టెంట్ ఎవరన్నది మాత్రం చెప్పలేదీ వినాయకుడి హీరో.
ఇక బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతూ.. ఈసారి విన్నర్ అయ్యే ఛాన్స్ త్రిగుణ్‌కి ఉందని చెప్పాడు. తన ఆటతీరు, తన అగ్రెషన్, ప్రవర్తన అన్నీ చూస్తే త్రిగుణ్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని జోస్యం చెప్పాడు. దేబ్జానీ కూడా గేమ్ బాగా ఆడుతోందని, సింగర్ ఝాన్సీ కూడా అందరినీ ఆకట్టుకుంటోందని కృష్ణుడు చెప్పాడు. ఈ సీజన్ టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరన్న దానిపై మాట్లాడుతూ.. త్రిగుణ్, రోహిత్, అమన్, ముఖేష్ గౌడ, ఝాన్సీ లకు టాప్ -5లో ఛాన్స్ ఉంటుందని కృష్ణుడు తెలిపారు. మరి బిగ్ బాస్ సీజన్ 10 కు సంబంధించి కృష్ణుడు అంచనాలు నిజమవుతాయా? లేదా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లేటెస్ట్ ప్రోమో..
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.