Headlines

దీన్ని బీట్ చేసే పాటే లేదు.. ఈ సాంగ్ పాడుకొని కుర్రాళ్లు ఉండరు.. మూడు దశాబ్దాలు దాటినా తగ్గని క్రేజ్


తెలుగు సినీ సంగీతంలో కొన్ని పాటలకు కాలంతో సంబంధమే ఉండదు. సినిమా విడుదలై దశాబ్దాలు గడిచిపోయినా.. ఆ పాట వినిపించగానే అప్పటి జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పండుగలు, గ్రామీణ వేడుకలు ఇలా ఏ సందర్భమైనా సరే.. కొన్ని పాటలు మాత్రం ప్రత్యేకంగా సందడి చేస్తుంటాయి. అలాంటి పాటల్లో ఒకటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే బావాలు సయ్యా. 1993లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాటకు ఇప్పటికీ ఉన్న క్రేజ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అప్పట్లో సోషల్ మీడియా లేదు.. యూట్యూబ్ లేదు.. పాటలు వైరల్ కావడానికి రీల్స్, షార్ట్స్ వంటి వేదికలు లేవు. అయినప్పటికీ ఈ పాట మాత్రం ఊరూవాడా మార్మోగిపోయింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగే వేడుకలు, పార్టీలు, రికార్డింగ్ డ్యాన్స్ కార్యక్రమాల్లో ఈ పాటకు ప్రత్యేకమైన డిమాండ్ ఉండేది. సుమన్, కృష్ణంరాజు ప్రధాన పాత్రల్లో నటించిన ‘బావ బావమరిది’ చిత్రంలోని ఈ పాట అప్పట్లో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. 1993లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోగా.. సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

ఈ చిత్రానికి ప్రముఖ సంగీత ద్వయం రాజ్-కోటి సంగీతాన్ని అందించారు. సినిమాలోని పాటలకు మంచి స్పందన రావడంతో పాటు.. ప్రత్యేకంగా చిత్రీకరించిన ‘బావాలు సయ్యా’ పాట మరింత హైలైట్‌గా నిలిచింది. ఈ పాటకు మరో ప్రధాన ఆకర్షణ సిల్క్ స్మిత. తనదైన డ్యాన్స్, గ్లామర్‌తో అప్పట్లోనే ఈ పాటకు ప్రత్యేకమైన క్రేజ్ తీసుకొచ్చారు. సిల్క్ స్మిత స్క్రీన్ ప్రెజెన్స్ కారణంగా ఈ పాట ప్రేక్షకుల్లో మరింతగా పాపులర్ అయిందని చెప్పొచ్చు. పాటలోని బీట్, మ్యూజిక్, డ్యాన్స్.. ఇవన్నీ కలిసిపోవడంతో అప్పటి యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏదైనా వేడుక జరిగిందంటే ఈ పాట తప్పకుండా వినిపించేదని అప్పటి ప్రేక్షకులు గుర్తుచేసుకుంటుంటారు.

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..! అప్పుడు తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి

ఇప్పుడంటే ఒక పాట హిట్ కావడానికి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, రీల్స్ వంటి ఎన్నో ఉన్నాయి. కానీ 1990లలో పరిస్థితి ఇలా ఉండేది కాదు. అయినప్పటికీ ‘బావాలు సయ్యా’ పాట మాత్రం నోటి మాటతోనే జనాల్లోకి వెళ్లిపోయింది. ఒక ప్రాంతంలో పాపులర్ అయిన పాట మరో ప్రాంతానికి చేరడానికి ఎక్కువ సమయం పట్టేది కాదు. క్యాసెట్లు, ఆడియో సిస్టమ్స్, ఫంక్షన్లు, రికార్డింగ్ డ్యాన్స్ కార్యక్రమాల ద్వారా ఈ పాట విపరీతంగా వినిపించేది. అలా ఒక తరం మొత్తాన్ని ఈ పాట తన బీట్‌తో ఊపేసింది. కాలం మారింది. సంగీతం మారింది. కొత్త తరహా పాటలు ఎన్నో వచ్చాయి. కానీ ‘బావాలు సయ్యా’ పాటకు ఉన్న ప్రత్యేకమైన మాస్ ఫీల్ మాత్రం ఇప్పటికీ అలాగే ఉందని చెప్పొచ్చు. గ్రామాల్లో జరిగే కొన్ని వేడుకల్లోనూ, పలు కార్యక్రమాల్లోనూ ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. అంతేకాదు.. యూట్యూబ్‌లోనూ పాత పాటలను వెతుకుతున్న సంగీత ప్రియులకు ఈ పాట తరచూ కనిపిస్తూనే ఉంది.

ఇవి కూడా చదవండి



స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా 460 రోజులు థియేటర్లలో హౌస్‌ఫుల్.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *